పంజాబ్‌లో ఉగ్ర కుట్న భగ్నం.. భారీ ఆయుధాలు స్వాధీనం

Punjab police bust terror module, పంజాబ్‌లో ఉగ్ర కుట్న భగ్నం.. భారీ ఆయుధాలు స్వాధీనం

దేశం భారీ విధ్వంసం సృష్టించాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. నిషేధిత ఉగ్ర సంస్థ ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్‌(కేజెడ్ఎఫ్)కు చెందిన భారీ మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఐదు ఏకే 47లు, పిస్టళ్లు, ఉపగ్రహ ఫోన్లు, గ్రనేడ్లు, నకిలీ కరెన్సీ, ఇతర సామాగ్రి ఉన్నాయి. ఇక ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఎన్‌ఐఏకు అప్పగించేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిర్ణయించారు. ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వం ఓ ప్రకటనను ఇచ్చింది. ఈ ఉగ్రవాదులు సరిహద్దుల్లో ఆయుధాలను సరఫరా చేసేందుకు డ్రోన్లను ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

కాగా పంజాబ్‌తో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో ఈ ఉగ్రవాదులు భారీ విధ్వంసం సృష్టించేందుకు వీరు ప్లాన్ చేశారన్న అనుమానంతో పర్యవేక్షణ చేయించాలని సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై డీజీపీ దినకర్ గుప్తా మాట్లాడుతూ.. ఇండియన్- పాక్ సరిహద్దుల్లో ఐఎస్ఐ ద్వారా డ్రోన్లను ఉపయోగించి.. ఆయుధాలను సరఫరా చేసి ఉండొచ్చు అన్న అనుమానాలు ఉన్నాయి. కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో నిషేధిత ఉగ్రవాదులు కుట్రకు పన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీనిపై నిఘా వర్గాల హెచ్చరికలతో ఆపరేషన్ చేపట్టాం. ఇందులో అమృత్‌సర్ ఇంటిలిజెన్స్ ఏఐజీ కేతన్ బలిరాం, చండీగఢ్‌కు చెందిన ఇతర పోలీసు బృందాలు పాల్గొననున్నాయి అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *