కెవ్వు.. కెవ్వు.. ఐదు ఓట్లు.. ఇంట్లో వెన్నుపోట్లు

తన ఇంట్లో మొత్తం తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారని, కానీ తనకు ఐదు ఓట్లే పడ్డాయని లోక్‌సభకు పోటీ చేసిన ఓ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. సొంతవాళ్లే తనకు ఓటేయలేదని ఆయన మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. పంజాబ్‌లో ఈ సంఘటన జరగగా.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పంజాబ్‌లోని జలంధర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నీతు సుతేరన్ పోటీ చేశారు. కౌంటింగ్‌ చేస్తున్న సమయంలో ఆయనకు ఐదు ఓట్లు వచ్చినట్లు అధికారులు […]

కెవ్వు.. కెవ్వు.. ఐదు ఓట్లు.. ఇంట్లో వెన్నుపోట్లు
Follow us

| Edited By:

Updated on: May 24, 2019 | 3:23 PM

తన ఇంట్లో మొత్తం తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారని, కానీ తనకు ఐదు ఓట్లే పడ్డాయని లోక్‌సభకు పోటీ చేసిన ఓ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. సొంతవాళ్లే తనకు ఓటేయలేదని ఆయన మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. పంజాబ్‌లో ఈ సంఘటన జరగగా.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పంజాబ్‌లోని జలంధర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నీతు సుతేరన్ పోటీ చేశారు. కౌంటింగ్‌ చేస్తున్న సమయంలో ఆయనకు ఐదు ఓట్లు వచ్చినట్లు అధికారులు అనౌన్స్ చేశారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన ఇంట్లో వాళ్లే వెన్నుపోటు పొడిచారంటూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఆ తరువాత అసలు విషయం బయటికొచ్చింది. జలంధర్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో 19వ స్థానంలో నిలిచిన సుతేరన్‌ 856 ఓట్లు సాధించినట్లు ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ వెల్లడించింది. అయితే తొలి రౌండ్ల లెక్కింపులో భాగంగా ఆయనకు 5 ఓట్లు రాగా.. అవే తనకు పడిన మొత్తమని అని సుతేరన్ భ్రమపడ్డారు. దీంతో ఆవేశం తట్టుకోలేక బోరున ఏడ్చేశారు సుతేరన్.

మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌..
మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌..
మానేరు వాగుపై వంతెన.. అప్పుడే కుప్పకూలిందిగా
మానేరు వాగుపై వంతెన.. అప్పుడే కుప్పకూలిందిగా
చల్ల.. చల్లని పోర్టబుల్ ఏసీ.. క్షణాల్లో చుట్టూ మంచు కురవాల్సిందే.
చల్ల.. చల్లని పోర్టబుల్ ఏసీ.. క్షణాల్లో చుట్టూ మంచు కురవాల్సిందే.
ఫ్యూచర్ సిటీ ఇలా ఉంటుంది.. రోబోలకు నివాసం.. మనుషులపై ప్రయోగం..
ఫ్యూచర్ సిటీ ఇలా ఉంటుంది.. రోబోలకు నివాసం.. మనుషులపై ప్రయోగం..
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మంకీ మ్యాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మంకీ మ్యాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
SRH Vs RCB మ్యాచ్ కోసం షెడ్యూల్ అవర్స్‌కి మించి మెట్రో రైలు సేవలు
SRH Vs RCB మ్యాచ్ కోసం షెడ్యూల్ అవర్స్‌కి మించి మెట్రో రైలు సేవలు
ఓటీటీలోకి వచ్చేస్తున్న మంజుమ్మెల్ బాయ్స్..
ఓటీటీలోకి వచ్చేస్తున్న మంజుమ్మెల్ బాయ్స్..
పంచతంత్రం.. ఈ ఐదు పదార్థాల గురించి తెలిస్తే కొలెస్ట్రాల్‌కు చెక్
పంచతంత్రం.. ఈ ఐదు పదార్థాల గురించి తెలిస్తే కొలెస్ట్రాల్‌కు చెక్
సొంతంగా ఐటీఆర్ దాఖలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి
సొంతంగా ఐటీఆర్ దాఖలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? రోజూ ఈ డ్రింక్స్ తాగి చూడండి.
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? రోజూ ఈ డ్రింక్స్ తాగి చూడండి.