పంజాబ్ లో రైతు చట్టాల రద్దు, మూడు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ మంగళవారం మూడు బిల్లులను ఆమోదించింది. దేశంలో రైతు చట్టాలను సభా ముఖంగా వ్యతిరేకించి వాటి స్థానే బిల్లులను ఆమోదించిన తొలి రాష్ట్రమయింది. రైతులనుంచి ఎవరైనా ఆహార ధాన్యాలను నిర్ణీత కనీస మద్దతు ధరకన్నా తక్కువకు కొన్నా, లేక అమ్మినా మూడేళ్ళ జైలు శిక్ష, అలాగే  రైతులను ఎవరు వేధించినా వారికి  భారీ జరిమానా  విధించడానికి ఈ బిల్లులు వీలు కల్పిస్తున్నాయి. ఆహారధాన్యాలను దొంగచాటుగా దాచినా, బ్లాక్ మార్కెటింగ్ […]

పంజాబ్ లో రైతు చట్టాల రద్దు, మూడు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 20, 2020 | 7:58 PM

కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ మంగళవారం మూడు బిల్లులను ఆమోదించింది. దేశంలో రైతు చట్టాలను సభా ముఖంగా వ్యతిరేకించి వాటి స్థానే బిల్లులను ఆమోదించిన తొలి రాష్ట్రమయింది. రైతులనుంచి ఎవరైనా ఆహార ధాన్యాలను నిర్ణీత కనీస మద్దతు ధరకన్నా తక్కువకు కొన్నా, లేక అమ్మినా మూడేళ్ళ జైలు శిక్ష, అలాగే  రైతులను ఎవరు వేధించినా వారికి  భారీ జరిమానా  విధించడానికి ఈ బిల్లులు వీలు కల్పిస్తున్నాయి. ఆహారధాన్యాలను దొంగచాటుగా దాచినా, బ్లాక్ మార్కెటింగ్ చేసినా కూడా శిక్ష తప్పదు. ఈ బిల్లుల ఆమోదానికి ముందు సీఎం అమరేందర్ సింగ్.. ఓ తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతూ.. రాజీనామా చేయడానికైనా తాను భయపడబోనని అన్నారు. తన ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసినా రైతులను కష్టాల పాలు చేయనని ఆయన ప్రకటించారు.