మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేసిన మంత్రనగరి రాజు ఆర్డీ బర్మన్‌

చిన్నప్పుడు రాహుల్‌ ఏడుపు అచ్చంగా పంచమస్వరంలా వుండేదట! అలాగే వినిపించేదట! అందుకే ఆయన్ను పంచమ్‌దా అనేది.

మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేసిన మంత్రనగరి రాజు ఆర్డీ బర్మన్‌
Follow us

|

Updated on: Jun 27, 2020 | 1:05 PM

ఆరో దశకం ఆరంభం. పిల్ల తెమ్మరగా సాగిపోతున్న హిందీ సినీ సంగీతంలోకి పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఓ యువకుడు ప్రవేశించాడు. వస్తూ వస్తూనే అలజడి సృష్టించాడు. సంప్రదాయపు సంకెళ్లను తెంచాడు. పాటను పరుగులు పెట్టించాడు. పాశ్చాత్య సంగీతానికి  సంప్రదాయ సంగీతపు మధురిమలు జోడించాడు. ఆ కొత్తదనానికి కుర్రకారు మంత్రముగ్ధులయ్యింది. అతను స్వరపరిచిన పాటలకు ఊగిపోయింది. మత్తుగా గమ్మత్తుగా వున్న సంగీతానికి పడి చచ్చిపోయింది. ఆ స్వరకర్త ఎవరో కాదు. ఎన్నేళ్లయినా, ఎన్నాళ్లయినా మర్చిపోవడం సాధ్యపడని రాహుల్‌దేవ్‌ బర్మన్‌.. ఇవాళ అభిమానులంతా ప్రేమగా పంచమ్‌దాగా పిలుచుకునే ఆ సంగీత దర్శకుడి జయంతి కాబట్టి నాలుగు మాటలతో ఆయన పాటలను స్మరించుకుందాం!

బాలీవుడ్‌ పాటలపై పంచమ్‌దా గాఢమైన ముద్ర వేశారు…దాన్ని అనుసరించాలని, అనుకరించాలని ఎంతో మంది ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు. అలా కుదిరే పని అయితే ఆర్డీ ఎందుకవుతాడు..? నిజంగానే ఆర్డీ స్టయిల్‌ను పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన కొత్త వాయిద్యాలు, సరికొత్త ధ్వనులు, నడకల్లో విరుపులు మరొకరికి చేతకాదు కాబట్టి. పాతవాటితో మొహంమొత్తిన సినీ సంగీతాభిమానులకు ఆర్డీ ప్రయోగాలన్నీ గొప్పగా అనిపించాయి. చప్పట్లు కొట్టించాయి. ఆనందాన్ని ఇచ్చాయి. సరికొత్త అనుభూతులను ఇచ్చాయి. ఇన్నేసి క్వాలిటీలు ఉన్నాయి కాబట్టే అనతి కాలంలోనే ఆయన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయ్యాడు. సచిన్‌దేవ్‌ బర్మన్‌ కుమారుడైనందుకో ఏమో తెలియదు కానీ రాహుల్‌కు సంగీతం డిఫాల్ట్‌గా వచ్చేసింది. ఎంతగా అంటే తొమ్మిదేళ్ల వయసులోనే పాటను కంపోజ్‌ చేసేటంతగా… ఇది నిజంగా వండరే! ప్యాసా సినిమాలో సర్ జో తెరా చక్రాయే అన్న పాట వినే ఉంటారు.. బాగా పాపులరైన ఆ పాటను పిల్లకుంకగా ఉన్నప్పుడు బర్మన్‌ ట్యూన్‌ చేసిందే! బాగుంది కదా అనేసి సచిన్‌ ఆ సౌండ్‌ట్రాక్‌ను యాజిటీస్‌గా వాడేశారు..

ఉస్తాద్‌ అలీ అక్బర్‌ఖాన్‌ దగ్గర శాస్ర్తీయ సంగీతాన్ని నేర్చుకున్న రాహుల్‌దేవ్‌ మౌత్‌ ఆర్గాన్‌ వాయించడంలో ఘటికుడు. తండ్రి సంగీతాన్ని అందించిన కొన్ని సినిమాలకు మౌత్‌ ఆర్గాన్‌ వాయించాడు కూడా! రాహుల్‌లో బోలెడంత టాలెంట్‌ ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం అంత ఈజీగా దొరకలేదు. గురుదత్‌ తన రాజ్‌ సినిమాలో అవకాశం ఇచ్చాడు కానీ రాహుల్‌ దురదృష్టం కొద్దీ ఆ సినిమాలో సగంలోనే ఆగిపోయింది.. రాహుల్‌లోని సంగీత తృష్ణను గమనించిన మెహమూద్‌ తన చోటే నవాబ్‌ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నియమించుకున్నాడు.. ఆ సినిమాలో పాటల్‌ బాగున్నా తర్వాత ఎందుకో పెద్దగా ఛాన్సులు రాలేదు.. కొంతకాలం తండ్రి దగ్గరే అసిస్టెంట్‌గా కొనసాగాడు. మళ్లీ మెహమూదే భూత్‌బంగ్లా సినిమాతో రెండో అవకాశం కల్పించాడు..అందులోని జాగో సోనేవాలో పాట పెద్ద హిట్టయ్యింది.. ఆర్డీ అంటే ఎవరూ అని ఆరా తీయించింది.. ఆ తర్వాత వచ్చిన తీస్రీమంజిల్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఆర్డీ కాంక్రీట్‌ వేసుకోగలిగాడు.

చిన్నప్పుడు రాహుల్‌ ఏడుపు అచ్చంగా పంచమస్వరంలా వుండేదట! అలాగే వినిపించేదట! అందుకే ఆయన్ను పంచమ్‌దా అనేది… నిజానికి ఈ పేరే ఎక్కువ పాపులరైంది కూడా…మీరు గమనించారో లేదో కానీ ఆర్డీ పాటల్లో సౌండ్‌ కంటే సోలే ఎక్కువగా వుంటుంది. అది ఫాస్ట్‌ బీటైనా, క్లాసికల్‌ సాంగైనా, ఫోక్‌ అయినా వినసొంపుగా వుండేది అందుకే. ఎప్పుడైనా మీరు పంచమ్‌దా పాటను హమ్‌ చేసుకుంటూ వెళ్లండి… ఆటోమాటిక్‌గా పాట మొత్తం మిమ్మల్ని చుట్టే తిరుగుతూ వుంటుంది.

సచిన్‌దేవ్‌ బర్మన్‌ కుమారుడే అయినా, ఆయన ఇన్‌ఫ్లూయెన్స్‌ పెద్దగా లేదు. కుర్రకారుకేం కావాలో, వారు కోరుకుంటున్నదేమిటో ఆర్డీకి బాగా తెలుసు! యువతకు కావాల్సిందేమిటో అదే అందించాడు. ఆర్డీ తొలి సినిమాలన్నీ మ్యూజికల్‌ హిట్సే. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా రాజేశ్‌ ఖన్నా సూపర్‌స్టార్‌డమ్‌ను నిలబెట్టింది పంచమ్‌దా పాటలే! పంచమ్‌దాలో ఓ అద్భుతమైన గాయకుడున్నాడు. ఎలాంటి భావాన్ని అయినా పలికించగల గళమది… తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన కళో, సంగీతమంటే విపరీతమైన అభిమానమో తెలియదు కానీ పంచమ్‌ దా పాడిన అన్ని పాటలు వినసొంపుగా చెవులకు ఇంపుగా వుంటాయి. అంతేనా పియాతో అబ్తో ఆజా పాటలో ఆర్డీ పెట్టిన కేకలను పక్కన పెట్టి పాటను ఓసారి వినిచూడండి. అస్సలు బాగోదు. రీమిక్స్‌లు, దానికి మిక్సింగులు, ఇలా ఈ పాట ఇంకో యాభై ఏళ్ల తర్వాత కూడా వినిపిస్తూనే ఉంటుంది. షోలే సినిమా ఎంత హిట్టయిందో అంతకు మించి మహబూబా పాట హిట్టయింది. సచిన్‌దేవ్‌ బర్మన్‌కు మాత్రం ఇలాంటి పాటలు, అరుపులు, కేకలు ఇష్టముండేవి కావు. కానీ ప్రేక్షకులు మాత్రం పడి చచ్చిపోయారు.. అక్కడితో ఆగాడా… ఆశాతో కలిసి క్యాబరేలనే గ్లామర్‌ పాటలకు గ్రామర్‌ను సృష్టించాడు. ఆంధ్రపత్రిక ఎడిటోరియల్‌ను కూడా అందమైన పాటగా తీర్చదిద్దగలవాడట మన మహదేవన్‌… ఆర్డీ కూడా అలాంటివాడే…ఏ హిందీ మిలాప్‌ న్యూస్‌నో… మరో పసందైన సెంటెన్స్‌లనో పంచమ్‌దాకు ఇస్తే అద్భుతమైన పాటగా మలచేవాడు.. గుల్జార్‌ తీసిన ఇజాజత్‌లోని మేరా కుచ్‌ సామాన్‌ అన్న పాటే ఇందుకు ఉదాహరణ…ఈ పాటలో కేవలం పదాలే వుంటాయి. అవే పదాలు లక్షలాది మంది పెదాలపై నర్తించాయి. నటించిన అనురాధ పటేల్‌కు ఫ్యాన్‌ మెయిల్‌ పెరిగింది. పాడిన ఆశాకు, రాసిన గుల్జార్‌కు అవార్డులను తెచ్చిపెట్టింది… దాదాపు రెండు దశాబ్దాల పాటు పంచమ్‌దా మ్యూజిక్‌ ఫీల్డ్‌ను ఏలాడు.. ఆర్డీ కోసం బడా బడా నిర్మాణ సంస్థలన్నీ కాచుకుని వుండేవి. స్టార్లు, సూపర్‌స్టార్లు ఎదురుచూసేవారు. షోలే, షాలీమార్‌, బర్నింగ్‌ ట్రయిన్‌ వంటి భారీ సినిమాలకే కాదు, చిన్న సినిమాలకు కూడా అదే శ్రద్ధతో సంగీతాన్ని అందించేవాడు. ఆర్డీ పాటలన్నీ హిట్‌ కావడానికి ఇదే కారణం. ఓ గొప్ప వింతేమిటంటే, ఆర్డీ బర్మన్‌కు ఒక్క నేషనల్‌ అవార్డు కూడా రాలేదు కానీ… ఆయన పాటలతో ప్రత్యేకంగా తీసిన డాక్యుమెంటరీలకు నేషనల్‌ అవార్డులు రావడం. సెమీ క్లాసికల్‌..సెమీ ఫిలాసఫికల్‌ టచ్‌ వున్న సాంగ్స్‌ అంటే రాహుల్‌కు చాలా ఇష్టం. బాలీవుడ్‌లో చెదిరిపోని ముద్రను వేసిన ఆర్డీకి ఎనిమిదో దశకం మధ్య నుంచి కష్టాలు మొదలయ్యాయి. అవకాశాలు రావడం తగ్గాయి. అప్పటికే లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌, బప్పీలహరీలు దూసుకుపోసాగారు. పెద్ద నిర్మాతలు మొహం చాటేయసాగారు. రామ్‌లఖన్‌ చిత్రానికి ఛాన్సిస్తానన్న సుభాష్‌ ఘాయ్‌ కూడా హ్యాండిచ్చాడు. ఇచ్చిన మాటను కాదని లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ను తీసుకున్నాడు. పంచమ్‌దాకు ఊహించని పెద్ద షాక్‌. అదే గుండెపోటుకు దారి తీసింది. చివరి రోజుల్లో ఆర్డీ చాలా కష్టపడ్డాడు.. ఓ పక్క షుగర్‌. మరో పక్క గుండెజబ్బు అతడిని కుంగదీశాయి. అవకాశాలు లేకపోవడం చికాకును పెంచాయి. దాంతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు.. చివరి దశల్లో సంగీతాన్ని అందించిన 1942 ఎ లవ్‌ స్టోరీ పాటలు సూపర్‌హిట్టయ్యాయి. ఆ ఆనందాన్ని అనుభవించే అవకాశం ఆర్డీకి లేకుండా పోయింది. ఆయన చనిపోయాక చాలా కాలం తర్వాత కేవలం ఆయన పాటలతోనే దిల్‌ విల్‌ ప్యార్‌ ప్యార్‌ సినిమా వచ్చింది. ఆ క్రెడిట్‌ ఒక్క బర్మన్‌కే దక్కుతుంది. పంచమ్‌దా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే… తెలుగులో చిన్నికృష్ణుడు, అంతం సినిమాలకు సంగీతాన్ని అందించాడు ఆర్డీ. మరే ఇతర సంగీత దర్శకులకు లేని వైవిధ్యం..నవ్యత పంచమ్‌దాలో వుంది.. ఇప్పటికీ బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లు ఏదో రకంగా ఆర్డీని తల్చుకుంటూనే వుంటున్నారు. దమ్‌ మారో దమ్‌ పాటను, అంతకు ముందు బచ్‌నా యే హసినో పాటను రీమిక్స్‌ చేశారు.. పంచమ్‌దాపై ఆర్‌డి బర్మన్‌-ది మ్యాన్‌-ది మ్యూజిక్‌ బయోగ్రఫీ అనే పుస్తకం వస్తే ఒక్క నెలలోనే మూడు వేల కాపీలు అమ్ముడయ్యాయట! పుస్తకానికే అంత డిమాండ్‌ వుంటే ఆయన పాటలకు ఎంతుండాలి? తరాలు మారినా..ఆర్డీ పాట మాత్రం నిలిచే వుంటుంది… యూత్‌కి ఆయన పాటలే దిక్కు, మొక్కు. ఆర్డీ బర్మన్‌…ఫరేవర్‌!

రాజ్, కావ్యల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం.. ఇరికించిన రుద్రాణి!
రాజ్, కావ్యల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం.. ఇరికించిన రుద్రాణి!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ప్లే ఆఫ్‌కు దగ్గరైన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో టాప్ 4 జట్లు..
ప్లే ఆఫ్‌కు దగ్గరైన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో టాప్ 4 జట్లు..
పక్కనే పెట్రోల్ బంకు..కారులోంచి మంటలు..!
పక్కనే పెట్రోల్ బంకు..కారులోంచి మంటలు..!
గాల్లోనే ఢీ కొట్టుకున్న2 మలేషియన్ హెలికాఫ్టర్లు.. 10 మంది మృతి
గాల్లోనే ఢీ కొట్టుకున్న2 మలేషియన్ హెలికాఫ్టర్లు.. 10 మంది మృతి
కుంభరాశిలో ఒంటరిగా శనీశ్వరుడు.. ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు..
కుంభరాశిలో ఒంటరిగా శనీశ్వరుడు.. ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు..
మామిడి పండ్లను తినే ముందు ఎందుకు నానబెట్టాలో తెలుసా.?
మామిడి పండ్లను తినే ముందు ఎందుకు నానబెట్టాలో తెలుసా.?
రోహిత్‌ను పక్కన పెట్టండి.. టీ20 ప్రపంచకప్‌లో కేరళ కుర్రాడిని
రోహిత్‌ను పక్కన పెట్టండి.. టీ20 ప్రపంచకప్‌లో కేరళ కుర్రాడిని
మేష రాశిలో శుక్ర, రవి సంచారం.. ఆ రాశుల వారికి రాజ యోగాలు!
మేష రాశిలో శుక్ర, రవి సంచారం.. ఆ రాశుల వారికి రాజ యోగాలు!
బర్త్‌డే కేక్‌ తిని చిన్నారి మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్..
బర్త్‌డే కేక్‌ తిని చిన్నారి మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్..
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?