Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

Big Boss Telugu3: బిగ్ బాస్‌కి వార్నింగ్ ఇచ్చిన పునర్నవి.. ఇదేం టాస్క్ అంటూ ఫైర్..

Big Boss Telugu3 Latest Updates, Big Boss Telugu3: బిగ్ బాస్‌కి వార్నింగ్ ఇచ్చిన పునర్నవి.. ఇదేం టాస్క్ అంటూ ఫైర్..

బిగ్ బాస్ 3 రోజురోజుకి ఆసక్తిగా సాగుతోంది. ఊహించని విధంగా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. థ్రిల్లింగ్ టాస్క్‌లతో బిగ్ బాస్ హౌస్ మేట్స్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. వారిమధ్య గొడవలు పెడుతున్నారు. తాజాగా నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకి ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే టాస్క్‌ను ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో బాబా భాస్కర్, హిమజ, రాహుల్, శిల్ప, వితికాలు దెయ్యాలుగా ఉంటారు. ఇక మ‌నుషులుగా వరుణ్, శ్రీముఖి, పునర్నవి, రవి, మహేష్‌లు ఉంటారు. అయితే దెయ్యాలుగా ఉన్నవారు మనుషులకు విసుగు తెప్పిస్తూ ఉండాలి.

టాస్క్‌లో భాగంగా దెయ్యాలు తెగ అల్లరి చేశారు. కేకలు పెడుతూ వికృతంగా ప్రవర్తించారు. వితికాకి ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ఆమె .. వరుణ్‌కి మూడు ముద్దులు పెట్టి బాత్రూం మిర్రర్‌పై వరుణ్ గోస్ట్ రాస్తుంది. దీంతో వితికా మాములు మ‌నిషిగా మారుతుంది. వ‌రుణ్ చ‌నిపోయి దెయ్యంగా మారుతాడు. ఇక హిమ‌జ .. శ్రీముఖి తలపై కోడిగుడ్డు కొట్టడం.. శిల్పా చ‌క్ర‌వ‌ర్తి.. పునర్నవిని పూల్‌లోకి తోసేయడంతో హిమ‌జ‌, శిల్పాలు మ‌నుషులుగా మారి శ్రీముఖి, పున‌ర్న‌వి దెయ్యం అవ‌తారం ఎత్తుతారు. అయితే టాస్క్‌లో ఉన్నంతసేపు ఎవరూ గొడవలు పడకూడదని.. కామ్‌గా ఉండాలని బిగ్ బాస్ హెచ్చరించారు. కాగా, టాస్క్ అయినంత సేపు కామ్ గా ఉన్న పునర్నవి ఆ తర్వాత ఫైర్ అయింది. ఇలాంటి గేమ్స్ ఎలా ఇస్తారు అంటూ.. బిగ్ బాస్ ఇది బుల్ షిట్ టాస్క్ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Related Tags