పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో దూకుడు పెరిగింది. కుదిరిన అన్ని మార్గాల ద్వారా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దాడి ఘటన తర్వాత దాడికి పాల్పడిన ఉగ్రవాది అదిల్ మహ్మద్ మాట్లాడిన వీడియోను జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ విడుదల చేసిన సంగతి తెలిసందే. అయితే ఆ వీడియోలో అతను కశ్మీర్ ఏర్పాటువాదం గురించి మాట్లాడాడు. దక్షిణ కశ్మీర్ ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారని, ఉత్తర కశ్మీర్, మధ్య కశ్మీర్ ప్రజలు కూడా జత కలవాలని కోరాడు. […]

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కీలక నిర్ణయం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 7:47 PM

న్యూఢిల్లీ: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో దూకుడు పెరిగింది. కుదిరిన అన్ని మార్గాల ద్వారా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దాడి ఘటన తర్వాత దాడికి పాల్పడిన ఉగ్రవాది అదిల్ మహ్మద్ మాట్లాడిన వీడియోను జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ విడుదల చేసిన సంగతి తెలిసందే. అయితే ఆ వీడియోలో అతను కశ్మీర్ ఏర్పాటువాదం గురించి మాట్లాడాడు. దక్షిణ కశ్మీర్ ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారని, ఉత్తర కశ్మీర్, మధ్య కశ్మీర్ ప్రజలు కూడా జత కలవాలని కోరాడు.

దీంతో కశ్మీర్ ఏర్పాటు వాదులపైకి దృష్టి మళ్లింది. దాడి ఘటన వెంటనే కశ్మీర్‌లో పర్యటించిన కేంద్ర హఓం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ పాకిస్థాన్, ఐఎస్ఐతో సంబంధాలున్న వేర్పాటువాదులకు కల్పిస్తున్న భద్రతను సమీక్షించాలని అన్నారు. ఆ నేపథ్యంలోనే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో తాజాగా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ముందడుగు వేసింది.

ఆరుగురు ఏర్పాటు వాద నేతలు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, అబ్దుల్ గనీ భట్, బిలాల్ లోన్, హషీమ్ ఖఉరేషీ, షబీర్ షాలకు కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించింది. ఈ మేరకు ఆదివారం కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో వారి కోసం ఏర్పాటు చేసిన భద్త సిబ్బందిని, వాహనాలను వెనక్కి తీసుకోనున్నారు.

ఈ నేపథ్యంలోనే జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం నుంచి ఆదివారం కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు వారి కోసం ఏర్పాటు చేసిన భద్రత సిబ్బందిని, భద్రత కోసం కల్పించిన వాహనాలను సాయంత్రానికల్లా వెనక్కి తీసుకోనున్నారు. తమకు అసలు భద్రతే అవసరం లేదని పాక్‌ అనుకూల నేత, వేర్పాటువాద నేతలు అంటున్నారు. అయితే వేర్పాటువాదులకు కల్పిస్తున్న భద్రతను ఉపసంహరిస్తూ జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..