అమెరికా-చైనా మధ్య ఇక ‘ ప్రజా యుద్ధం ‘!

అమెరికా-చైనా మధ్య వాణిజ్య పోరు తీవ్రమవుతోంది. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ మొండి వైఖరిని తాము సహించబోమని చైనా తాజాగా హెచ్చరించింది. అమెరికాపై ‘ ప్రజాయుద్ధం ‘ చేస్తామని చైనా కమ్యూనిస్టు పార్టీ తమ ‘ గ్లోబల్ టైమ్స్ ‘ అధికార పత్రికలో వార్నింగ్ ఇచ్చింది. టారిఫ్ ల విషయంలో అమెరికా అదే పనిగా అబద్ధాలు చెబుతోందని ఈ పత్రిక పేర్కొంది. తమ దేశం నుంచి చైనాకు ఎగుమతి అవుతున్న వాణిజ్య ఉత్పత్తులపై ఆ దేశం సుంకాలు పెంచడాన్ని ఇటీవల ఖండించిన ట్రంప్.. మేము కూడా తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని అన్నారు. జూన్ నెలలో జీ-20 సమ్మిట్ సందర్భంగా ఈయన, చైనా ప్రధాని జీ పింగ్ భేటీ అవుతున్న నేపథ్యంలో ఈ ట్రేడ్ వార్ వీరి మధ్య దూరాన్ని పెంచుతోంది. అలాగే ఉభయదేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. తమతో వాణిజ్య యుద్ధం జరపడంలో ట్రంప్ ప్రభుత్వం అమెరికన్ల ప్రయోజనాలను హైజాక్ చేస్తున్నారని గ్లోబల్ టైమ్స్ ఆరోపించింది. ఈ వార్ ఒక వ్యక్తికి, ఒక టీం కు మధ్య కాదని, ఇది అమెరికన్ల ప్రయోజనాలను కాలరాయడమేనని ఈ పత్రిక అదే పనిగా దుయ్యబట్టింది. ఈ నేపథ్యంలో..ట్రంప్..ఇండియాను కూడా తప్పు పట్టిన విషయాన్ని ట్రేడ్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇండియాను ఆయన ‘ టారిఫ్ కింగ్ ‘ గా అభివర్ణించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *