ఈ సైకోను ఏం చేయాలి..?

దారుణం.. కన్నీళ్లకే కన్నీళ్లు పెట్టించే సంఘటన.. వాడు మృగమా..? మనిషా..? మృగంకన్నా దారుణమైన కిరాతకుడు. ఈ సైకో వల్ల ఆ ఊరిలో ఆడవాళ్లకు నిద్రే కరువయ్యిందట. హన్మకొండలో ఓ మృగాడు చేసిన అఘాయిత్యం.. మానవత్వానికే కన్నీరు పెట్టించింది.

తాను మనిషని మరిచిన ఓ సైకో సరిగ్గా మాటలే రాని, అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మంగళవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం అర్థరాత్రి తల్లితండ్రులతో కలిసి నిద్రిస్తున్న తొమ్మిది నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి ఓ ఉన్మాది అత్యాచారానికి పాల్పడ్డాడు. ఊపిరి ఆడక ఆ చిన్నారి మృతి చెందింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పక్క కాలనీలో నివాసముంటున్న ప్రవీణ్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

అర్థరాత్రి నిద్రిస్తోన్న సమయంలో పాప తల్లికి మెళకువ రాగా.. లేచి చూస్తే శ్రీహిత కనిపించలేదు. చుట్టుపక్కల గాలించగా ఓ వ్యక్తి పాపను తీసుకుని పరిగెడుతుండగా కనిపించాడు. పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆ వ్యక్తి పాపను కింద పడేసి పారిబోతుండగా, ఆ సైకోను పట్టుకుని స్థానికులు చితకబాదారు. అప్పటికే పాపను చూసేసరికి ఎలాంటి కదలిక లేకపోవడం.. శరీరం నుంచి అధిక రక్తస్రావం కావడాన్ని గుర్తించారు తల్లిదండ్రులు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా పాప మరణించిందని డాక్టర్లు చెప్పారు. దీంతో.. 9 నెలలు ప్రేమతో మోసి కన్న చిన్నారి, 9 నెలలు కూడా నిండకుండానే పోయిందే అని రోదిస్తున్నారు తల్లిదండ్రులు. ఈ సైకో మరి కొన్ని నేరాలకు కూడా పాల్పడినట్లు పోలీసు రికార్డుల పేర్కొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *