బ్రేకింగ్ : రాసలీలల ఫోన్ కాల్‌పై పృథ్వీ రియాక్షన్ ఇదే…!

మహిళా ఉద్యోగినితో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడాడంటూ ఓ ఫోన్ కాల్ రికార్డిండ్ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఆయనపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ సీఐటీయూ డిమాండ్ చేస్తోంది. మరోవైపు టీటీడీ విజిలెన్స్ కూడా ఫోన్ కాల్ దుమారంపై ఫోకస్ పెట్టింది. త్వరలోనే పృథ్వీని వివరణ అడిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై పృథ్వీ స్పందించారు. తాను ఏ ఉద్యోగినితో ఫోన్‌లో మాట్లాడలేదని..ఆ ఆడియోలో ఉన్న […]

బ్రేకింగ్ : రాసలీలల ఫోన్ కాల్‌పై పృథ్వీ రియాక్షన్ ఇదే...!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 12, 2020 | 2:34 PM

మహిళా ఉద్యోగినితో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడాడంటూ ఓ ఫోన్ కాల్ రికార్డిండ్ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఆయనపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ సీఐటీయూ డిమాండ్ చేస్తోంది. మరోవైపు టీటీడీ విజిలెన్స్ కూడా ఫోన్ కాల్ దుమారంపై ఫోకస్ పెట్టింది. త్వరలోనే పృథ్వీని వివరణ అడిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

తాజాగా ఈ విషయంపై పృథ్వీ స్పందించారు. తాను ఏ ఉద్యోగినితో ఫోన్‌లో మాట్లాడలేదని..ఆ ఆడియోలో ఉన్న వాయిస్‌ కూడా తనది కాదన్నారు. తాను ఎస్వీబీసీ చైర్మన్ అవ్వడం చాలామందికి ఇష్టం లేదని, వారే కావాలని ఇటువంటి వివాదాల్లో ఇరికించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఫోన్‌ కాల్‌ వివాదంపై విచారణకు సిద్దమేనన్న పృథ్వీ, తప్పుచేశానని తేలితే ఎటువంటి శిక్ష వేసినా శిరసావహిస్తానన్నారు. మహిళల పట్ల ఎంతో గౌరవంగా మెలుగుతానని, ఆ విషయం ఉద్యోగులకు కూడా తెలుసన్నారు. తనలో ఎటువంటి అసభ్య ప్రవర్తనలు లేవని వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి బెబుతానన్నారు పృథ్వీ.