తప్పుడు వ్యాఖ్యలు నిరూపిస్తే.. 101 గుంజీలు తీస్తాః మమతా బెనర్జీ

దుర్గాపూజలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది దుర్గా పూజ వద్దని తాను అన్నట్లుగా నిరూపిస్తే ప్రజల ముందు 101 సార్లు గుంజీలు తీస్తానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.

తప్పుడు వ్యాఖ్యలు నిరూపిస్తే.. 101 గుంజీలు తీస్తాః మమతా బెనర్జీ
Follow us

|

Updated on: Sep 08, 2020 | 7:26 PM

దుర్గాపూజలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది దుర్గా పూజ వద్దని తాను అన్నట్లుగా నిరూపిస్తే ప్రజల ముందు 101 సార్లు గుంజీలు తీస్తానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. పూజల నిర్వహణపై ఒక రాజకీయ పార్టీ వదంతులు వ్యాపిస్తున్నదని ఆమె ఆరోపించారు. దసరా నేపథ్యంలో ప్రతి ఏటా కోల్‌కతాలో ఘనంగా నిర్వహించే దుర్గా పూజపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మమత స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. అటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ రోజు కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఈసారి దుర్గా పూజను రద్దు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మమతా కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు దురుద్దేశంతో తప్పుడు వదంతులు ప్రచారం చేస్తున్నదని, ప్రజలు వాటిని నమ్మవద్దని మమత తెలిపారు. పోలీస్ డే సందర్భంగా మంగళవారం నిర్వహించిన ఆన్‌లైన్ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె పరోక్షంగా బీజేపీపై విరుచుకుపడ్డారు.