అక్కడ రైతులు..ఇక్కడ జెఎసి.. బాబుకిక పరేషానేనా?

మొన్నటికి మొన్న గురువారం నాడు అమరావతిలో రైతుల నిరసనలు.. నేటికి నేడు సోమవారం కర్నూలులో హైకోర్టు సాధన జెఎసి ఆగ్రహ జ్వాలలు… వెరసి టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎటెళ్ళినా ఎదురీతేనా? ఇదేనా పాలక వైసీపీ కొత్త పొలిటికల్ ఎత్తుగడ? పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. గత వారం అమరావతి పర్యటనకు బయలుదేరిన చంద్రబాబుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. రాజధాని ప్రాంతానికి అలా చేరుకున్నారో లేదో ఇలా నిరసన పర్యం ఎదురైంది. చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ […]

అక్కడ రైతులు..ఇక్కడ జెఎసి.. బాబుకిక పరేషానేనా?
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 02, 2019 | 4:51 PM

మొన్నటికి మొన్న గురువారం నాడు అమరావతిలో రైతుల నిరసనలు.. నేటికి నేడు సోమవారం కర్నూలులో హైకోర్టు సాధన జెఎసి ఆగ్రహ జ్వాలలు… వెరసి టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎటెళ్ళినా ఎదురీతేనా? ఇదేనా పాలక వైసీపీ కొత్త పొలిటికల్ ఎత్తుగడ? పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది.

గత వారం అమరావతి పర్యటనకు బయలుదేరిన చంద్రబాబుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. రాజధాని ప్రాంతానికి అలా చేరుకున్నారో లేదో ఇలా నిరసన పర్యం ఎదురైంది. చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ కొందరు ఆయన ప్రయాణించిన బస్సుపై రాళ్ళు, చెప్పులు విసిరి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాజధాని ప్రాంత రైతులను చంద్రబాబు మోసం చేశారంటూ కొందరు రైతులు ఆరోపించారు.

ఇది జరిగి వారం తిరక్కముందే కర్నూలు పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు అక్కడ హైకోర్టు సాధన సమితికి సంబంధించిన జెఎసి నిరసనలతో స్వాగతం పలికింది. కర్నూలులో వినిపిస్తున్న హైకోర్టు డిమాండ్‌ను అస్సలు పట్టించుకోకుండా అమరావతిలోనే హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని జెఎసి ప్రతినిధులు ఆరోపించారు.

సో.. అధికార పార్టీ వ్యూహమో లేక అధికార పార్టీని ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్న స్థానిక నాయకుల వ్యూహమో కానీ చంద్రబాబు జిల్లాల పర్యటనలు ఆయనకు చేదు అనుభవాన్ని చూపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు కామెంట్ చేస్తున్నారు. ఇలా చిన్న పాటి నిరసనలతో మొదలై ఫ్యూచర్‌లో బాబును జిల్లాలకు వెళ్ళాలంటే భయపడేలా చేస్తారేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పక్కా ప్లానో లేదా యాదృచ్ఛికమో కానీ.. చంద్రబాబుకు జిల్లాల పర్యటనలు మిగిలిస్తున్న చేదు అనుభవాలు అధికార పార్టీనేతలను ఆనందంలో ముంచెత్తుతున్నాయని పలువురు అంటున్నారు. సో.. ఇంకా నాలుగున్నరేళ్ళు చంద్రబాబుకీ పరిస్థితి తప్పదేమో అన్న డౌట్లు కూడా వినిపిస్తున్నాయి.