Chandrababu: బాబును అడ్డుకున్నోళ్ళు కటకటాల్లోకి.. వైజాగ్‌ ట్విస్టు

విశాఖ పట్నం పోలీసులు ఎట్టకేలకు యాక్షన్‌లోకి దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబును విశాఖలోకి రావద్దంటూ ఆందోళన చేసిన వారిలో కొందరిని అరెస్టు చేశారు.

Chandrababu: బాబును అడ్డుకున్నోళ్ళు కటకటాల్లోకి.. వైజాగ్‌ ట్విస్టు
Follow us

|

Updated on: Feb 29, 2020 | 5:29 PM

Vizag police arrested protesters: విశాఖ పట్నం పోలీసులు ఎట్టకేలకు యాక్షన్‌లోకి దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబును విశాఖలోకి రావద్దంటూ ఆందోళన చేసిన వారిలో కొందరిని అరెస్టు చేశారు. ముఖ్యంగా చెప్పులు విసిరిన వారిని, ఆత్మాహుతికి యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

ఫిబ్రవరి 27న చంద్రబాబును విశాఖలోకి రాకుండా ఎయిర్‌పోర్టులో నిలువరించిన వారిలో కొందరినీ వైజాగ్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ అడ్దగింపు వ్యవహారంలో యాక్షన్ ప్రారంభించారు. పలువురిపై కేసునమోదు చేసిన ఎయిర్ పోర్ట్ పోలీసులు.. వీడియో ఫుటేజీ ఆధారంగా కొందరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులోకి తీసుకున్న వారిలో ఏపీ ప్రజాసంఘం నాయకుడు జెటి రామారావు కూడా వున్నారు. కాన్వాయ్ పైకి ఎక్కి పెట్రోల్ పోసుకుంటానని బెదిరించిన వ్యక్తిగా జేటీ రామారావును గుర్తించారు.

మహిళా ఎస్సై విధినిర్వహణకు ఆటంకం కలిగించినందుకు మరికరిపై కేసు నమోదు చేశారు. కోడిగుడ్లు, చెప్పులు విసిరిన వ్యవహారంలో గరికిన వెంకట్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళా ఎస్సైపై చేయిచేసుకుని, దుర్భాషలాడినందుకు కృపను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. మొత్తం మీద 47 మందికి పైగా నిరసనకారులపై కేసులు నమోదు చేశారు. ఇందులో 35 మందికి పైగా వైసీపీ మద్దతుదారులుకాగా 11 మంది టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులపై కేసులు పెట్టారు ఎయిర్ పోర్ట్ పోలీసులు. ఇందులో రామారావును అరెస్టు చేసిన పోలీసులు.. మరికొందరి అరెస్టుకు రెడీ అవుతున్నారు.