బెంగళూరులో వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. అంతా ఆన్ లైన్..

కరోనా రక్కసి బారిన పడకుండా లాక్ డౌన్ వేళ ఇంటిపట్టున ఉండి ప్రాణాలు కాపాడుకుంటే చాలురా దేవుడా అని ప్రజలంతా వణికిపోతుంటే, వ్యభిచార నిర్వాహాకులు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా తమ దందాను కొనసాగించేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ హబ్‌గా పేరున్న బెంగళూరులో వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఓ వ్యక్తి  ఇచ్చిన సమాచారంతో న‌గ‌రంలోని య‌శ్వంత్‌పూర్ ఏరియాలోగ‌ల ఓ గెస్ట్‌హౌస్‌‌పై దాడులు నిర్వహించారు. వ్య‌భిచార గృహం నిర్వ‌హిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అదుపులోకి […]

బెంగళూరులో వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. అంతా ఆన్ లైన్..
Follow us

|

Updated on: Jul 08, 2020 | 3:22 PM

కరోనా రక్కసి బారిన పడకుండా లాక్ డౌన్ వేళ ఇంటిపట్టున ఉండి ప్రాణాలు కాపాడుకుంటే చాలురా దేవుడా అని ప్రజలంతా వణికిపోతుంటే, వ్యభిచార నిర్వాహాకులు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా తమ దందాను కొనసాగించేస్తున్నారు.

సాఫ్ట్‌వేర్ హబ్‌గా పేరున్న బెంగళూరులో వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఓ వ్యక్తి  ఇచ్చిన సమాచారంతో న‌గ‌రంలోని య‌శ్వంత్‌పూర్ ఏరియాలోగ‌ల ఓ గెస్ట్‌హౌస్‌‌పై దాడులు నిర్వహించారు. వ్య‌భిచార గృహం నిర్వ‌హిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి చెర‌లో ఉన్న ఐదుగురు యువ‌తుల‌ను ర‌క్షించి రెస్క్యూ హోమ్‌కు త‌ర‌లించారు.

ఇదిలావుంటే.. గ‌త‌వారం కూడా సీసీబీ పోలీసులు ఓ వ్య‌భిచార ముఠాగుట్టు పట్టుకున్నారు. ఆ ముఠా చెర‌లో ఉన్న‌ 27 మంది మ‌హిళ‌ల‌ను కాపాడి బెంగ‌ళూరులోని రెస్క్యూ హోమ్‌కు త‌ర‌లించారు.

వీరంతా లాక్ డౌన్ సమయంలో ఇళ్లలో ఉంటున్నవారిని టార్గెట్ గాచేసుకుని దందా సాగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. నగరంలో మరిన్ని వ్యభిచార ముఠాలు ఉన్నట్లుగా గుర్తించామని బెంగ‌ళూరు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ తెలిపారు. వాటిపై కూడా త్వరలోనే రైడ్ నిర్వహిస్తామని అన్నారు.