నేర విచారణలో పాతకాలపు పద్ధతులు మానుకోండి: హోం మంత్రి అమిత్ షా

పోలీసులు నేర విచారణలో పాతకాలపు పద్ధతులకు స్వస్తి చెప్పి, సాంకేతికతను వినియోగించుకుని సైంటిఫిక్ పద్ధతుల్లో నిజాలు రాబట్టాలన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా.  బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్‌డీ) 49వ అవతరణ వేడుకల  సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  నేరస్తుడు, లేక నేర స్వభావం కలిగిన వారి విషయంలో ఇప్పటికే థర్డ్ డిగ్రీ ఉపయోగించడం, ఫోన్ ట్యాపింగ్ చేయడం వంటివి పాత పద్ధతులను విడిచిపెట్టాలని అమిత్ షా సూచించారు. నేరాలు జరిగినప్పుడు […]

నేర విచారణలో పాతకాలపు పద్ధతులు మానుకోండి: హోం మంత్రి అమిత్ షా
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2019 | 5:30 PM

పోలీసులు నేర విచారణలో పాతకాలపు పద్ధతులకు స్వస్తి చెప్పి, సాంకేతికతను వినియోగించుకుని సైంటిఫిక్ పద్ధతుల్లో నిజాలు రాబట్టాలన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా.  బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్‌డీ) 49వ అవతరణ వేడుకల  సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  నేరస్తుడు, లేక నేర స్వభావం కలిగిన వారి విషయంలో ఇప్పటికే థర్డ్ డిగ్రీ ఉపయోగించడం, ఫోన్ ట్యాపింగ్ చేయడం వంటివి పాత పద్ధతులను విడిచిపెట్టాలని అమిత్ షా సూచించారు.

నేరాలు జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ నిందితులను పట్టివ్వడంలో ఎంతో సహకరిస్తుందన్నారు అమిత్ షా. క్రిమినల్ కేసుల పరిష్కారంలో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ చాలా కీలకమని తెలిపారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ పక్కాగా ఉంటే క్రిమినల్ కేసుల్లో తీర్పులు వెల్లడించే న్యాయమూర్తులు, కేసును వాదించే డిఫెన్స్ లాయర్లలకు ఎంతో వెసులుబాటు ఉంటుందన్నారు. జాతీయ స్ధాయిలో పోలీస్ యూనివర్సిటీ మరియు ఫోరెన్సిక్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై త్వరలోనే కేంద్ర మంత్రి వర్గంలో చర్చిస్తామని చెప్పారు. మోడస్ ఓపెరెండీ బ్యూరోస్ విషయంలో ప్రధాని మోదీతో చర్చించినట్టు చెప్పారు హో మంత్రి.

బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్‌డీ) కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేస్తుంది. పోలీస్ విభాగాల్లో టెక్నాలజీ ఉపయోగాలను వివరించడంతో పాటు నేర విచారణలో అనుసరించాల్సిన పద్థతులపై ట్రైనింగ్ ఇస్తారు.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?