భూ రిజిస్ట్రేషన్ విలువ పెంచేసిన ఏపీ ప్రభుత్వం

భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్… భూముల రిజిస్ట్రేషన్ విలువను రాష్ట్ర వ్యాప్తంగా 5 శాతం మేర పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇక పట్టణ శివారు, గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువను 10 శాతం పెంచాలనే నిర్ణయానికి వచ్చారు. పెంచిన భూ రిజిస్ట్రేషన్ల ధరలు ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్నాయి. భూముల రిజిస్ట్రేషన్ల ధరల పెంపుతో రూ. 6500 […]

భూ రిజిస్ట్రేషన్ విలువ పెంచేసిన ఏపీ ప్రభుత్వం
Follow us

|

Updated on: Jul 31, 2019 | 4:12 AM

భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్… భూముల రిజిస్ట్రేషన్ విలువను రాష్ట్ర వ్యాప్తంగా 5 శాతం మేర పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇక పట్టణ శివారు, గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువను 10 శాతం పెంచాలనే నిర్ణయానికి వచ్చారు. పెంచిన భూ రిజిస్ట్రేషన్ల ధరలు ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్నాయి. భూముల రిజిస్ట్రేషన్ల ధరల పెంపుతో రూ. 6500 కోట్ల ఆదాయాన్ని పొందాలని ఏపీ సర్కార్ టార్గెట్‌గా పెట్టుకుంది. కాగా, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి గతేడాది రూ. 4800 కోట్ల మేర ఆదాయం ఆర్జించింది ఏపీ ప్రభుత్వం.