ల్యాప్ టాప్ కొనాలంటే అంత పని చేయాలా..?

బెంగుళూరుకి చెందిన ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ విద్యార్ధులపట్ల నీచంగా ప్రవర్తించారు. ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావాలంటే ల్యాప్ ఉండాల్సిందేనంటూ కండీషన్ పెట్టాడు.

ల్యాప్ టాప్ కొనాలంటే అంత పని చేయాలా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 09, 2020 | 3:13 PM

కరోనా లాక్ డౌన్ విద్యార్థుల జీవిత చిత్రాన్నే మార్చేసింది. ఉరుకులు పరుగులతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడం పోయింది. ఇంట్లో కూర్చేనే ఎంచక్కా క్లాసులు వినే పరిస్థితి వచ్చింది. ఆన్ లైన్ క్లాసులతో విద్యార్థులకు ఎప్పటికప్పుడు పాఠాలు బోధిస్తున్నారు అధ్యాపకులు. ఇదే క్రమంలో బెంగుళూరుకి చెందిన ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ విద్యార్ధులపట్ల నీచంగా ప్రవర్తించారు. ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావాలంటే ల్యాప్ ఉండాల్సిందేనంటూ కండీషన్ పెట్టాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ మారాయి. బెంగళూరుకు చెందిన ఎంవీజే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ ఆన్ లైన్ క్లాసులు మొదలుపెట్టాడు. ఇందుకోసం ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ల్యాప్ లాప్ ఉండాల్సిందేనన్నారు. అంతటితో ఆగకుండా ల్యాప్ టాప్ కోసం యాచించండి, అప్పు చేయండి, దొంగతనం చేయండి. ల్యాప్ టాప్ ఉంటేనే క్లాసులకు అటెండ్ అవ్వండి అంటూ విద్యార్ధులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. మన జీవితంలో ల్యాప్ టాప్ ఒక భాగమైందని, ఇందుకోసం ఏదో విధంగా ల్యాప్ టాప్ కొనుక్కోవాలని సూచించాడు. ల్యాప్ టాప్ లు లేనివారికి క్లాసులు ఉండవని మరీ హెచ్చరించాడు. ఫ్రొఫెసర్ వ్యాఖ్యలపై విద్యార్ధుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాల్లో లాప్ టాప్ లు కొనాలంటే తలకు మించిన భారమని, మరోవైపు విద్యాబుద్ధులు నేర్పాల్సి అధ్యాపకులే బతకడానికి తప్పడు మార్గాలు చూపించడమేంటని ప్రశ్నిస్తున్నారు.