కాలేజీ లైబ్రరీలో శృంగారం.. స్టూడెంట్స్‌కు అడ్డంగా దొరికిన ప్రొఫెసర్!

తల్లిదండ్రుల తర్వాత గురువు దైవంతో సమానం అని అంటారు. అలాంటి దైవంతో సమానమైన గురువు.. ఓ చెత్త పని చేస్తూ స్టూడెంట్స్‌కు అడ్డంగా దొరికిపోయాడు. స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పాల్సిన ఆ ప్రొఫెసర్.. ఏకంగా కాలేజీ లైబ్రరీని శృంగార కామకలాపాలకు అడ్డాగా మార్చుకున్నాడు. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రొఫెసర్ మార్క్ తన వక్రబుద్ధిని చూపిస్తూ.. రీసెర్చ్ స్కాలర్‌గా పని చేస్తున్న సోఫియాను లైంగికంగా వేధించడం మొదలుపెడతాడు. అంతేకాకుండా ఆమెను లోబరుచుకుని తన శారీరిక […]

కాలేజీ లైబ్రరీలో శృంగారం.. స్టూడెంట్స్‌కు అడ్డంగా దొరికిన ప్రొఫెసర్!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 26, 2019 | 3:53 PM

తల్లిదండ్రుల తర్వాత గురువు దైవంతో సమానం అని అంటారు. అలాంటి దైవంతో సమానమైన గురువు.. ఓ చెత్త పని చేస్తూ స్టూడెంట్స్‌కు అడ్డంగా దొరికిపోయాడు. స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పాల్సిన ఆ ప్రొఫెసర్.. ఏకంగా కాలేజీ లైబ్రరీని శృంగార కామకలాపాలకు అడ్డాగా మార్చుకున్నాడు. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రొఫెసర్ మార్క్ తన వక్రబుద్ధిని చూపిస్తూ.. రీసెర్చ్ స్కాలర్‌గా పని చేస్తున్న సోఫియాను లైంగికంగా వేధించడం మొదలుపెడతాడు. అంతేకాకుండా ఆమెను లోబరుచుకుని తన శారీరిక వాంఛలు తీర్చుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే యూనివర్సిటీ లైబ్రరీని తన రాసలీలలకు అడ్డాగా మార్చేశాడు. ఒకానొక సందర్భంగాలో కాలేజీకి వీకెండ్ హాలిడేస్ ఇచ్చినప్పుడు సోఫియాను లైబ్రరీకి రమ్మని ఆదేశించి… ఆమె వద్దన్నా వినకుండా.. శృంగార పర్వం కొనసాగించాడు.

ఈలోపు కొంతమంది స్టూడెంట్స్ అక్కడికి రాగా.. జరుగుతున్న ఈ తతంగం మొత్తం చూసి షాక్ అయ్యారు. వెంటనే యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి జైలుకు పంపించారు.