Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

రానాకు చికిత్స జరిగింది.. సంచలన విషయాలు చెప్పిన సురేష్ బాబు

Suresh babu on Rana Health, రానాకు చికిత్స జరిగింది.. సంచలన విషయాలు చెప్పిన సురేష్ బాబు

టాలీవుడ్ భల్లాలదేవ రానా ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పుకార్లు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఆరోగ్యం బావుందని రానా పలుమార్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించినప్పటికీ.. ఇటీవల ఆ హీరో ఎక్కువ యాక్టివ్‌గా లేకపోవడం.. విదేశాల్లోనే ఎక్కువ గడుపుతుండటంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడలేదు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రానా ఆరోగ్యంపై ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పష్టతను ఇచ్చారు.

రానాకు చిన్నప్పుడే కంటి సమస్య ఉందని.. అయితే అప్పుడు చికిత్స చేస్తే తట్టుకోవడం కష్టమని చెప్పిన డాక్టర్లు.. పెద్దైన తరువాత చికిత్స తీసుకుంటే మంచిదని సూచించారని సురేష్ బాబు చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన చికిత్స ఈ మధ్యే పూర్తయ్యిందని.. అయితే సర్జరీ జరిగిన తర్వాత టెన్షన్ పడటంతో బీపీ అటాక్ అయ్యి.. కాస్త బలహీనంగా అయిపోయాడని సురేష్ బాబు తెలిపాడు. అంతేకానీ తన కుమారుడికి ఏం కాలేదని.. కొన్ని రోజుల్లో మళ్లీ మునుపటిలా తిరిగి వస్తాడు, చూడండి అంటూ ఆయన రూమర్లకు చెక్ పెట్టారు.

కాగా ఇటీవలే రానా ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇంకా హైదరాబాద్‌కు రాననప్పటికీ.. ఇప్పుడు ముంబైలో ఉన్నాడు. ప్రస్తుతం రానా చేతిలో అర డజన్‌కు పైగా చిత్రాలు ఉన్నాయి. తెలుగు, తమిళం, హిందీలో పలు ప్రాజెక్ట్‌లను అతను ఒప్పుకున్నాడు. అయితే అనారోగ్యంతో కొన్నిరోజులుగా అన్ని షూటింగ్‌లకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన త్వరలోనే మళ్లీ సినమాలతో బిజీ అవ్వనున్నట్లు తెలుస్తోంది.

Related Tags