Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

మెట్టు దిగని కంగనా..టెన్షన్‌లో ఏక్తా

Producer Ekta Kapoor Judgment hai kya kangana, మెట్టు దిగని కంగనా..టెన్షన్‌లో ఏక్తా

ఏక్తా కపూర్‌ సినిమాకొచ్చిన కష్టం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. కంగనా లీడ్ రోల్‌లో ఆమె చేసిన జడ్జిమెంట‌ల్ హే క్యా.. ఇప్పటికే గాలిలో దీపంలాగే మిణుకుమిణుకుమంటోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ జూలై 26, మరో వారం కూడా గ్యాప్ లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయింది. అయినా సినిమా ఊసు మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. దీనంతటికీ కారణం ఈ మూవీలో లీడ్ రోల్ పోషించిన కంగనా మొండితనమే.

రెండు వారాల క్రితం బాలీవుడ్‌ను షేక్ చేసిన కంగనా వర్సెస్ మీడియా ఎపిసోడ్ ఇంకా చల్లారలేదు. కంగనా నోటి దురుసుతనంతో ఆగ్రహంతో ఊగిపోయారు ముంబై ఫిలిం నగర్ జర్నలిస్టులు. వీరంతా ఒక్కతాటిపైకి వచ్చి ఆమె అప్ కమింగ్ మూవీ మీద పడ్డారు. దీంతో జడ్జిమెంటల్ హే క్యా సినిమా ప్రమోషన్‌కి ఫుల్‌స్టాప్ పడిపోయింది.

ముంబై జర్నలిస్టులు ఒక మెట్టు కిందికి దిగి కంగనా సారీ చెబితే అంతా సర్దుకుంటుందన్నారు. అయినా వారి మాటను అస్సలు పట్టించుకున్న పాపాన పోలేదు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా మంకుపట్టుదలను కొనసాగించింది. అయితే ఈ ఎపిసోడ్‌లో ఓ కంటితుడుపు చర్యగా సంజాయిషీ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో కనీసం సారీ అనే పదమే ఎక్కడా కనిపించలేదు. పైగా జర్నలిస్టులకు ఎథిక్స్ అనేవే లేకుండా పోయాయని .. నా వార్తలు వేసుకుని బతికే మీరా నన్ను ప్రశ్నించేది అంటూ రివర్స్ ఎటాక్ చేసింది. దీంతో కంగనాతో మీడియా వార్ పీక్ స్టేజ్‌కి చేరింది.
ప్రస్తుతం మూవీ నిర్మాతలకు కంగనా పెద్ద తలనొప్పిగా తయారైందట. ఆమె వల్లే తమ సినిమాకి దెబ్బ పడుతుందనే బెంగపెట్టుకున్నారట ప్రొడ్యూసర్స్. ఓ వైపు రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ.. కంగనా మనసు ఏ మాత్రం కరగకపోయే సరికి నెత్తీనోరు బాదకుంటోందట నిర్మాత ఏక్తా కపూర్.