సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన నిర్మాత సి.కల్యాణ్.. చిత్ర పరిశ్రమ తరపున త్వరలోనే గొప్ప సన్మానం..

తెలుగు సినీ పరిశ్రమకు వరాలజల్లు కురిపించిన సీఎం కేసీఆర్‌కు నిర్మాత సి.కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమ తరపున త్వరలోనే ఆయనకు గొప్ప సన్మానం చేస్తామని ప్రకటించారు.

  • uppula Raju
  • Publish Date - 5:01 pm, Mon, 23 November 20

తెలుగు సినీ పరిశ్రమకు వరాలజల్లు కురిపించిన సీఎం కేసీఆర్‌కు నిర్మాత సి.కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమ తరపున త్వరలోనే ఆయనకు గొప్ప సన్మానం చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ పరిశ్రమను వేధిస్తున్న సమస్యలలో ఒకటి టికెట్ ధర అన్నారు. చిన్న సినిమా నిర్మాతలకు భవిష్యత్ ఉండేలా టికెట్ ధరలను మార్చుకునే వెసులుబాటు కల్పించడం శుభపరిణామమని తెలిపారు.

భారతదేశంలో మొట్ట మొదటి సారిగా సినీ కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందేలా తెల్ల రేషన్ కార్డులు, ఇన్సూరెన్సు కార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయం అన్నారు. రూ.10 కోట్లలోపు బడ్జెట్ ఉన్న సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలకు ఇకపై రాష్ట్రంలో థియేటర్స్ దొరకవు అనే సమస్యకి నేటితో పరిష్కారం దొరికిందన్నారు. సినిమా థియేటర్స్‌లో షోస్ పెరగడం వల్ల చిన్న నిర్మాతలు భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు తీయడానికి ముందుకు వస్తారని పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ తరపున కార్మికులకు, నిర్మాతలకు, అండగా నిలబడ్డ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల సినీ పరిశ్రమలలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ నిర్ణయాలు మార్గదర్శకంగా ఉంటాయని కొనియాడారు.