Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజ్యసభ సెక్రటరియేట్లో ఒక విభాగానికి సీల్. అందులో పనిచేసే అధికారికి కోవిడ్-19 పాజిటివ్. శానిటైజ్ చేయడం కోసం కార్యాలయాన్ని సీల్ చేసిన అధికారులు.
  • దేశ రాజధాని ఢిల్లీలో చిరు జల్లులు. వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రత నుంచి ఊరట. రానున్న 3 రోజుల్లో మరింత తగ్గనున్న ఉష్ణోగ్రత. గత 4 రోజులుగా రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలు. ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు.
  • కరీంనగర్ పట్టణం కిసాన్ నగర్ లో దారుణం.. కన్నతల్లికి కరోనా ఉందంటూ ఇంట్లో నుండి గెంటేసిన కన్న కొడుకులు. ఇటీవలే మహారాష్ట్ర స్టేట్ షోలాపూర్ నుండి కరీంనగర్ కు వచ్చిన తల్లి శ్యామల. కరోనా లేకపోయినా కొడుకులు ఇంట్లో నుండి గెంటి వేయడంతో ఇంటి బయటే రోడ్డు మీద కూర్చొని ఉన్న వృద్ధురాలు. ఇంట్లో నుండి గెంటివేసిన కొడుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు.
  • విశాఖ: కోవిడ్ నకిలీ పాసుల కేసు. డీజీ ఆఫీస్ నుంచి పోలీసులు జారీచెసే వాహనాల పాసులను సృష్టిస్తున్న మాయగాళ్ళు. ఒరిజినల్ పాస్ స్కాన్ చేసి.. వివరాలు మార్చి సొమ్ముచేసుకుంటున్న కేటుగాళ్ళు. ఒక్కోపాసు 3 నుంచి 6 వేలకు అమ్మకాలు.
  • పుల్వామాలో ఉగ్రదాడికి కుట్ర చేసిన వ్యక్తిని గుర్తించిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు. పేలుడు పదార్థాలను అమర్చిన కారు హిదయతుల్లా మాలిక్‌కు చెందినదని పోలీసులు వెల్లడి. నిందితుడిని షోపియాన్‌కు చెందిన హిదయతుల్లాగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడి. హిజుబుల్‌ ముజాహిద్దీన్‌లో హిదయతుల్లా చేరినట్లు సమాచారం.
  • తెలంగాణ కల సాకారమయ్యింది. తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్‌ ఓ ఉజ్వలఘట్టం. నిర్వాసితుల త్యాగాల వల్లే ప్రాజెక్టు సాధ్యమయ్యింది. నిర్వాసిత గ్రామాల యువతకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఉద్యోగాలు.

Mahesh Babu: మహేష్‌‌ మూవీకి అసలు సమస్య కొరటాలనా..?

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తలపై సూపర్‌స్టార్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. తమ హీరో తదుపరి సినిమా ఏంటి..? అసలు మహేష్‌ బాబు ఏం ఆలోచిస్తున్నారు..? సూపర్‌స్టార్‌ ఎందుకు ఇంత డైలమాలో ఉన్నారు..? ఇలాంటి ప్రశ్నలు వారందరిలో తొలుస్తున్నాయి.
Problems for Mahesh Babu movie, Mahesh Babu: మహేష్‌‌ మూవీకి అసలు సమస్య కొరటాలనా..?

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తలపై సూపర్‌స్టార్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. తమ హీరో తదుపరి సినిమా ఏంటి..? అసలు మహేష్‌ బాబు ఏం ఆలోచిస్తున్నారు..? సూపర్‌స్టార్‌ ఎందుకు ఇంత డైలమాలో ఉన్నారు..? ఇలాంటి ప్రశ్నలు వారందరిలో తొలుస్తున్నాయి. అంతకుముందు మహేష్ చిత్రం వంశీ పైడిపల్లితో ఉంటుందని అనుకున్నప్పటికీ.. ఆ తరువాత పరశురామ్ లైన్‌లోకి వచ్చారట. పరశురామ్ చెప్పిన కథ మహేష్‌కు బాగా కనెక్ట్ అవ్వగా.. ఈ డైరక్టర్‌తో ముందుకు వెళ్లాలని సూపర్‌స్టార్ అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు చాలా అడ్డుంకులే ఎదురవవుతున్నాయట. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌కు కొరటాల శివ పెద్ద సమస్యగా మారినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం పరశురామ్‌ను మహేష్‌ దగ్గరకు తీసుకువెళ్లడంలో కొరటాల శివ ప్రధాన పాత్ర పోషించారట. ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్‌తో కొరటాల ఓ డీల్‌ను కుదుర్చుకున్నారట. ఈ ప్రాజెక్ట్‌కు మహేష్‌ ఓకే చెప్తే.. తనకు సగ భాగం వాటా ఇవ్వాలని అన్నారట. అందుకు అప్పట్లో మైత్రీ కూడా ఓకే చెప్పిందట. ఇదిలా ఉంటే ఇప్పటికే 14 రీల్స్‌తో పరశురామ్‌ అగ్రిమెంట్ చేసుకున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో 14 రీల్స్ కూడా భాగం అవ్వాలనుకుంటుందట. అయితే అది మైత్రీ సంస్థకు ఇష్టం లేదట. ఎందుకంటే 14 రీల్స్ కూడా వస్తే సినిమా మొత్తం మూడు వాటాలుగా మారుతుంది. దాని వలన లాభాలు తగ్గిపోతాయి. అందుకే ఆ సంస్థతో భాగస్వామ్యం అయ్యేందుకు ఇష్టం చూపించడం లేదట. ఇలా కాకుండా కొరటాల శివ ఇందులో లేకపోతే అప్పుడు 14రీల్స్‌కు భాగస్వామ్యం ఇచ్చేందుకు మైత్రీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదంతా ఇలా ఉంటే మహేష్‌తో సినిమా విషయమై నేరుగా తేల్చుకోవడానికి పరశురామ్ వెళ్లాలనుకున్నారట. ఇక ఇదే మీటింగ్‌లో మైత్రీ మూవీ మేకర్స్, నమ్రత కూడా భాగం అవ్వగా.. ప్రాజెక్ట్, టెక్నీషియన్ల గురించి మాట్లాడారు తప్ప.. నిర్మాణం, భాగస్వామ్యం గురించి ప్రస్తావించలేదట. దీంతో పరశురామ్ కాస్త అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఏం మాట్లాడకుండా బయటకు వచ్చేశారట. ఇక ఈ విషయంలో పరశురామ్‌కు మైత్రీ వారు ఓ సలహా ఇచ్చారట. 14 రీల్స్‌తో మాట్లాడుకొని వస్తే రండి, లేదంటే లేదు అన్నట్లుగా వారు పరోక్షంగా పరశురామ్‌కు హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఫుల్ ఎపిసోడ్‌ క్లైమాక్స్‌లో ఇప్పుడు బంతి పరశురామ్ కోర్టులో ఉందట. ఈ క్రమంలో 14 రీల్స్‌తో వదులుకొని మైత్రీ-కొరటాల శివతో కలిసి మహేష్‌తో సినిమా చేస్తారా..? లేక 14 రీల్స్ కోసం మహేష్ సినిమాను వాయిదా వేస్తారా..? తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: మహేష్ బాబు వీరాభిమాని మృతి.. కారణమిదేనా.?

Related Tags