అమృత్ సర్…. స్వర్ణాలయంలో మళ్ళీ ఖలిస్తాన్ అనుకూల నినాదాలు

పంజాబ్...అమృత్ సర్ లోని  స్వర్ణ దేవాలయంలో సిక్కు అతివాదులు మళ్ళీ ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. 'ఆపరేషన్ బ్లూ స్టార్' 36వ యానివర్సరీని పురస్కరించుకుని..

అమృత్ సర్.... స్వర్ణాలయంలో మళ్ళీ ఖలిస్తాన్ అనుకూల నినాదాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 06, 2020 | 7:55 PM

పంజాబ్…అమృత్ సర్ లోని  స్వర్ణ దేవాలయంలో సిక్కు అతివాదులు మళ్ళీ ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ 36వ యానివర్సరీని పురస్కరించుకుని శనివారం ఈ ఆలయ సమీపంలోని అకల్ తక్త్ వద్ద జరిగిన కార్యక్రమం సందర్భంగా వారి నినాదాలతో ఆ ప్రాంగణం మారు మోగింది. శిరోమణి అకాలీదళ్ (అమృత్ సర్ ) అధ్యక్షుడు, మాజీ ఎంపీ సిమ్ రంజిత్ సింగ్ మాన్ కుమారుడైన ఇమాన్ సింగ్ నేతృత్వంలో సుమారు వంద మంది సభ్యులు అక్కడ చేరారు. 1984  లో ఈ స్వర్ణాలయంలో దాక్కున్న సాయుధ టెర్రరిస్టులను ఏరివేసేందుకు నాటి ప్రభుత్వం ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ కార్యక్రమాన్ని చేబట్టింది. అకల్ తక్త్ జతేదార్ జ్ఞానీ హర్ ప్రీత్ సింగ్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సభ్యులతో బాటు సిక్కు అతివాద సంస్థ.. దమ్ దమీ తక్సల్ మెంబర్స్ కూడా ఈ సందర్భంగా సమావేశమై.. నాటి  బ్లూ స్టార్ ఆపరేషన్ లో హతులైనవారి కుటుంబ సభ్యులను సత్కరించారు. ఆ ఆపరేషన్ చేపట్టినప్పుడు సిక్కులకు తగిలిన గాయాలు ఇంకా మానలేదని జ్ఞానీ హర్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. కాగా… ప్రతి ఏటా ఇక్కడ ఈ యానివర్సరీ కార్యక్రమానికి సుమారు లక్ష మంది హాజరవుతుంటారు. కానీ కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా.. పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉండడంతో వెయ్యి మంది మాత్రం అటెండ్ అయ్యారు.