భారత రైతులకు బాసట, వాషింగ్టన్ లో ఖలిస్తాన్ అనుకూల బృందాల నిరసన, చట్టాల రద్దుకు డిమాండ్

అమెరికాలో ఖలిస్తాన్ అనుకూల బృందాలు భారత రైతులకు మద్దతు ప్రకటించాయి. ఇండియాలో మోదీ ప్రభుత్వం   తెచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ.

భారత రైతులకు బాసట, వాషింగ్టన్ లో ఖలిస్తాన్  అనుకూల బృందాల నిరసన, చట్టాల రద్దుకు డిమాండ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 27, 2021 | 1:07 PM

అమెరికాలో ఖలిస్తాన్ అనుకూల బృందాలు భారత రైతులకు మద్దతు ప్రకటించాయి. ఇండియాలో మోదీ ప్రభుత్వం   తెచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఆందోళన చేస్తున్న అన్నదాతలకు అండగా ఉంటామంటూ వాషింగ్టన్ లో భారత రాయబార కార్యాలయం ఎదుట ఈ బృందాల సభ్యులు ప్రొటెస్ట్ చేశారు. సిఖ్ డీ ఎంవీ యూత్, అండ్ సంగత్  ఆధ్వర్యాన కొంతమంది చేరి.. కొత్త రైతు చట్టాలపట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పలువురు కాషాయ రంగు పతాకాలను చేతబట్టుకున్నారు. భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ చట్టాలు మానవ హక్కులను, భారత ప్రజాస్వామ్యాన్ని అతిక్రమించేవిగా ఉన్నాయని ప్రొటెస్టర్లలో ఒకరైన నరేందర్ సింగ్ అనే సభ్యుడు ఆరోపించారు. ప్రతి ఏడాదీ జనవరి 26 న తాము బ్లాక్ డే గా పాటిస్తామని, కానీ ఈ ఏడాది భారత అన్నదాతలకు మద్దతుగా నిలిచామని ఆయన అన్నాడు.నిరసన చేస్తున్న రైతులు  ఇండియాలో కేవలం సిక్కులే కాక, దేశ వ్యాప్తంగా అన్ని మతాలకు చెందినవారని ఆయన చెప్పారు.

నెల రోజుల క్రితమే వాషింగ్టన్ లో భారత ఎంబసీ సమీపంలోని  మహాత్మా గాంధీ విగ్రహానికి  కొందరు ఖలిస్తానీ జెండాను కప్పారు. ఆ ఘటన నేపథ్యంలో నిన్న ఇక్కడ గట్టి పోలీసు బలగాలను మోహరించారు.