మణిందర్‌ మ్యాజిక్: బెంగాల్ వారియర్స్‌ సూపర్ విన్

Pro Kabaddi 2019 Bengal Warriors vs Puneri Paltan in Mumbai: Bengal Beats Pune 43-23, మణిందర్‌ మ్యాజిక్: బెంగాల్ వారియర్స్‌ సూపర్ విన్

ముంబయి: ప్రొకబడ్డీ ఏడో సీజన్‌లో బెంగాల్‌ వారియర్స్‌ సత్తా చాటింది. పుణెరి పల్టాన్‌పై 43-23 తేడాతో ఘన విజయం సాధించింది. మణిందర్‌ సింగ్‌ 16 సార్లు కూతకెళ్లి 14 పాయింట్లు అందించాడు. 5 పాయింట్లతో రింకూ నర్వాల్‌ టాప్‌ డిఫెండర్‌గా నిలిచాడు. మహ్మద్‌ నబీభక్ష్‌ (8) సత్తా చాటాడు. మ్యాచ్‌ సాంతం పుణెపై బంగాల్‌ ఆధిపత్యం చాటింది. 22 రైడ్‌ పాయింట్లతో చెలరేగింది. మూడుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసింది. పుణె రైడింగ్‌లో కేవలం 13 పాయింట్లే సాధించింది.

అంతకు ముందు తమిళ్‌ తలైవాస్‌, పట్నా పైరేట్స్‌ మధ్య నువ్వానేనా అన్నట్టు మ్యాచ్‌ జరిగింది. ఉత్కంఠభరితంగా  సాగిన పోరులో పట్నా 24-23 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *