ప్రధాని సొంత రాష్ట్రంలోనే మోదీపై విరుచుకుపడ్డ ప్రియాంక గాంధీ

, ప్రధాని సొంత రాష్ట్రంలోనే మోదీపై విరుచుకుపడ్డ ప్రియాంక గాంధీ

గాంధీనగర్ : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన తొలి సభలోనే ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అది కూడా మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఆమె ధ్వజమెత్తారు. గతంలో భారీ హామీలు ఇచ్చిన నేతలను ప్రశ్నించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. “ఏవీ రెండు కోట్ల ఉద్యోగాలు? ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారు… ఏమైందా హామీ?” అంటూ నిలదీశారు.

ఇవి తన హృదయంలోంచి వస్తున్న మాటలని, ఎదురుగా కనిపిస్తున్న జనసందోహాన్ని చూశాక వారి ఆక్రోశం తనకు స్పష్టంగా అర్థమవుతోందని ప్రియాంక అన్నారు. దేశవ్యాప్తంగా విద్వేషం పెరిగిపోయిందని, వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోయాయని విమర్శించారు. అర్థంపర్థంలేని విషయాలను పక్కనబెట్టి మహిళల భద్రత, యువత, రైతుల సమస్యలపై దృష్టిపెట్టాలని అన్నారు. ఓటు ఓ ఆయుధం లాంటిదని, అది ఎవరినీ గాయపర్చకపోయినా, ప్రజలను మాత్రం దృఢంగా మలుస్తుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *