యూపీ పోలీసులపై ప్రియాంక గాంధీ ఫైర్

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర్ ప్రదేశ్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ, కార్యక్రమం అనంతరం పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించినందుకు అరెస్టయిన రిటైర్డ్ ఐపిఎస్ అధికారిని కలవడానికి బయలుదేరారు. అయితే ఆమెను నిరోధించే ప్రయత్నంలో లక్నో పోలీసు సిబ్బంది ఆమె మెడ పట్టుకుని నేలమీదకు నెట్టారని ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. 76 ఏళ్ల ఎస్.ఆర్.దారాపురి ఇంటికి వెళుతుండగా పోలీసు […]

యూపీ పోలీసులపై ప్రియాంక గాంధీ ఫైర్
Follow us

| Edited By:

Updated on: Dec 28, 2019 | 11:35 PM

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర్ ప్రదేశ్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ, కార్యక్రమం అనంతరం పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించినందుకు అరెస్టయిన రిటైర్డ్ ఐపిఎస్ అధికారిని కలవడానికి బయలుదేరారు. అయితే ఆమెను నిరోధించే ప్రయత్నంలో లక్నో పోలీసు సిబ్బంది ఆమె మెడ పట్టుకుని నేలమీదకు నెట్టారని ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు.

76 ఏళ్ల ఎస్.ఆర్.దారాపురి ఇంటికి వెళుతుండగా పోలీసు సిబ్బంది ఆమెను ఆపివేసి, పార్టీ కార్యకర్త స్కూటర్‌పై ప్రయాణించమని బలవంతం చేశారని ప్రియాంక పేర్కొన్నారు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక కూడలి వద్ద మళ్ళీ ఆమెను అడ్డగించారు. దీంతో ఇందిరానగర్ లోని సెక్టార్ 18 లోని దారాపురి నివాసానికి కాలినడకన వెళ్ళాలని ఆమె నిర్ణయించుకున్నారు.

ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, “నన్ను మహిళా పోలీసులు చుట్టుముట్టారు, వారిలో ఒకరు నా గొంతు పట్టుకున్నారు. మరో మహిళా పోలీసు నన్ను నెట్టివేసారు. నేను కింద పడిపోయాను” అని ఆమె పేర్కొన్నారు. నగరంలో “శాంతిభద్రతల” పరిస్థితిని కాపాడటానికి ఆమెను ఆపివేసి ఉండవచ్చనే వాదనలను ప్రియాంక గాంధీ తిరస్కరించారు. “నేను శాంతియుతంగా వెళ్తున్నప్పుడు శాంతిభద్రతల పరిస్థితి ఎలా దిగజారింది? నన్ను ఆపడానికి వారికి హక్కు లేదు అని ప్రియాంక తెలిపారు.

[svt-event date=”28/12/2019,10:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]