ఇక్కడ మీరు మాత్రమే మిస్‌ అయ్యారు.. కానీ నాతో పాటే ఉన్నారు.. తండ్రిపై ప్రియాంక భావోద్వేగ ట్వీట్‌

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు నటి ప్రియాంక చోప్రా. ఈ 20 సంవత్సరాల్లో పలు భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించడంతో పాటు నిర్మాతగా

  • Tv9 Telugu
  • Publish Date - 9:39 am, Sat, 28 November 20
ఇక్కడ మీరు మాత్రమే మిస్‌ అయ్యారు.. కానీ నాతో పాటే ఉన్నారు.. తండ్రిపై ప్రియాంక భావోద్వేగ ట్వీట్‌

Priyanka Chopra father: సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు నటి ప్రియాంక చోప్రా. ఈ 20 సంవత్సరాల్లో పలు భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించడంతో పాటు నిర్మాతగా, గాయకురాలిగా తన ప్రతిభను చాటుకున్నారు. అంతేకాదు భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒక్కటైన పద్మశ్రీని అందుకున్నారు. 2016లో ప్రియాంకకు పద్మశ్రీ రాగా.. ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ని పెట్టారు. (కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 753 కొత్త కేసులు.. ముగ్గురు మృతి.. కోలుకున్న 952 మంది)

పద్మశ్రీ అందుకున్న రోజు నాకెన్నో అద్భుతమైన ఙ్ఞాపకాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఈ అవార్డు నాకు లభించినప్పటికీ.. దీని వలన నా కుటుంబం పొందిన సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఒక ఆర్మీ నేపథ్యం గలిగిన కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా.. ఈ అవార్డు నా కుటుంబానికి మరింత గౌరవాన్ని అందించింది. ఆ రోజు మా నాన్నమ్మ, మా పెద నాన్న, అమ్మ, తమ్ముడు, మా మాలు, అత్తలు అందరూ రాష్ట్రపతి భవన్‌కి వచ్చారు. మా పెద్దనాన్న యూనిఫామ్‌తో ఆర్మీ యూనిఫామ్‌లో వచ్చి చాలా గర్వించారు. ఆయన కళ్లలోనే ఆ సంతోషం, గర్వం కనిపించింది. కానీ అక్కడ మా నాన్న ఒక్కరే మిస్ అయ్యారు. ఇప్పుడు భౌతికంగా ఆయన లేనప్పటికీ.. ఎప్పటికీ నాతోనే ఉంటారు. నా జర్నీలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు అంటూ భావోద్వేగ కామెంట్‌ పెట్టారు. కాగా తండ్రిని అమితంగా ఇష్టపడే ప్రియాంక.. తన చేతిపై డాడీస్‌ లిటిల్‌ గర్ల్‌ అని టాటూ వేయించుకున్న విషయం తెలిసిందే. (ఒక్కటైన బజరంగ్‌ పునియా, సంగీతా ఫొగట్‌.. ఘనంగా జరిగిన భారత రెజ్లర్ల పెళ్లి వేడుక)

https://www.instagram.com/p/CIGCeH-nC8L/?utm_source=ig_embed