ఆకట్టుకుంటోన్న ‘మల్లేశం’ ట్రైలర్

కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు ఆర్.రాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మల్లేశం’. పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

మల్లేశం తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి ఆసు యంత్రం తయారు చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో తను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, ఒడిడుకులు. అన్ని అవరోధాలు అధిగమించి మల్లేశం తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు అన్న నేపధ్యమే ఈ సినిమా కథాంశం.

ఝాన్సీ, అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ అధికార్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 21న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *