Breaking News
  • దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభన గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24, 879 పాజిటివ్ కేసులు నమోదు కాగా 487 మంది మృతి. దేశంలో కరోన బాధితుల సంఖ్య 7, 67, 296 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 2, 69, 789 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 4, 76, 378 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 21, 129 మంది మృతి.
  • విజయవాడ: ఈ నెల 20 నుంచి ప్రథమ్ మొబైల్ యాప్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు జారీ. నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్లు జారీ ని ప్రారంబించాలని ఆర్టీసీ నిర్ణయం. తొలుత ప్రయోగాత్మకంగా 19 డిపోల పరిధిలో మొబైల్ యాప్ ద్వారా టికెట్ల జారీ చేయాలని ఎండీ నిర్ణయం.
  • టీవీ9 తో కోవిడ్ 19 కమాండ్ కంట్రోల్ స్పెషలాఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. గాలిలో కరోనా వైరస్ వ్యాపించదు. భౌతిక దూరం పాటిస్తే సరిపోతుంది. దగ్గినప్పుడు తుమ్మినప్పుడు తుంపర్లు మీద పడకుండా ఉండే దూరంలో ఉంటే సరిపోతుంది. వైరస్ సోకిన వాళ్ళు వెంటనే ఆసుపత్రికి రావాలి. సీరియస్ అయినప్పుడు వస్తే రికవరీ కావడం కష్టం అందుకే డెత్ డేట్ స్వల్పంగా పెరిగింది. వైరస్ వచ్చిన వాళ్లకు ముఖ్యమంత్రి హోమ్ ఐసోలేషన్ సౌకర్యం కల్పించారు. 55 సంవత్సరాల వయసు పైబడిన డాక్టర్లు ఎవ్వరు డ్యూటీకి రావడం లేదు. టెలిమెడిసిన్ సౌకర్యానికి వారందరినీ ఉపయోగించుకుంటాం. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఫీజులను ఏపీలో కూడా ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు ఇచ్చేలా ముఖ్యమంత్రి ఆదేశించారు.
  • పెరుగుతున్న కరోనాకేసుల్తో మార్కెట్లలో బెంబేలు . ఈనెల 12వ తేదీ నుండి కొత్తపేట్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను మూసివేత నిర్ణయం. మళ్లీ ప్రకటించే వరకూ రైతులు ఎవరు మార్కెట్ రావద్దని ప్రకటన. వేల సంఖ్యలో రైతులతో కిటకిట లాడే మార్కెట్లో నిబంధనలు పాటించడంలేదంటూ ఆందోళన. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో మూసివేత నిర్ణయం తీసుకున్న కమిటి. ప్రతి రోజు 5వందల నుంచి వేయి టన్నుల పండ్ల అమ్మకాలు . 250 మంది వ్యాపారులు...3వందల మంది హమాలీలతో ఉన్న గడ్డి అన్నారం మార్కెట్.
  • నిమ్స్ లోని నెఫ్రాలజీ లో డయాలసిస్ పేషెంట్స్ ఆందోళన. డయాలసిస్ చేయడం లేదంటూ నిమ్స్ వద్ద నిరసన . డయాలసిస్ కోసం పేర్లు కూడా రిజిస్టర్ చేసుకోవడం లేదు అంటూ ఆందోళన . గంటలు తరబడి లైన్లో నిలుచున్నా పట్టించుకునే వారు లేరంటూ ఆవేదన . వారానికి నాలుగు సార్లు చేయవలసిన డయాలసిస్ మూడు సార్లే చేస్తున్నారు. 4 గంటలు నిర్వహించాల్సిన డయాలసీస్ 3 గంటలే చేస్తున్నారంటున్న పేషంట్లు . సకాలంలో డయాలసీస్ చేయకపోతే ప్రాణాలు పోతాయంటూ ఆందోళన.
  • విశాఖ: కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్ లో కరోనా కలకలం. టెస్ట్ లు నిర్బహించే ముగ్గురు టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్. ల్యాబ్ లో సేవలందించే 20 మందికి పరీక్షలు.. అందరికీ నెగెటి. వైరాలజీ ల్యాబ్ లో సేవలు తాత్కాలికంగా నిలిపివేత.. ల్యాబ్ లో శానిటైజ్ చేస్తున్న జీవీఎంసీ సిబ్బంది. ప్రత్యామ్నాయంగా కేజీహెచ్ లోని నాకో ల్యాబ్ ను వినియోగిస్తున్న వైద్య సిబ్బంది.

ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా.. క్లైమాక్స్ మార్పు

, ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా.. క్లైమాక్స్ మార్పు

కన్నుగీటి ఓవర్ నైట్ లోనే స్టార్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికగా వచ్చిన చిత్రం ‘ఒరు అడార్ లవ్’. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో వాలెంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్ ప్రియా వారియర్ ద్వారా సినిమాకి మంచి పాపులారిటీ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను బాగా నిరాశ పరిచింది. దీనితో రంగంలోకి దిగిన చిత్ర బృందం క్లైమాక్స్ మార్చాలని నిర్ణయించారు.    

, ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా.. క్లైమాక్స్ మార్పు

దర్శకుడు ఒమర్ లులు మాట్లాడుతూ ‘క్లైమాక్స్ సీన్స్ మళ్ళీ మార్పులు చేసి చిత్రీకరించాం. బుధవారం నుంచి కొత్త క్లైమాక్స్ తో చిత్రం ప్రదర్శించబడుతుందని’ అని అన్నారు. నా మనసుకు నచ్చిన కథ ఇది. అందుకే రియలిస్టిక్ గా తెరకెక్కించాలని సినిమా క్లైమాక్స్ ట్రాజెడీ తో ఎండ్ చేశాం. కానీ ఆ సన్నివేశం అందరిని నిరాశ పరిచింది. దీనితో క్లైమాక్స్ మొత్తం మార్చి తెరకెక్కించాం’ అని వెల్లడించారు.

Related Tags