కర్నూలు జిల్లాలో బస్సుబోల్తా… 30 మందికి గాయాలు!

Private, కర్నూలు జిల్లాలో బస్సుబోల్తా… 30 మందికి గాయాలు!

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలోని పెద్దబోదనం సమీపంలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. వివరాల్లోకెళితే… కరీంనగర్‌ జిల్లా తిమ్మాపురం మండలం వచ్చనూరు గ్రామానికి చెందిన క్రిష్ణమాచారి, నవబ్రహ్మాచారి కుటుంబీకులు ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో తీర్థయాత్రలకు బయల్దేరారు. గత రాత్రి మహానంది పుణ్యక్షేత్రంలో బసచేసి ఉదయాన్నే బ్రహ్మంగారి మఠానికి బయల్దేరారు. పెద్దబోదనం సమీపానికి చేరుకోగానే ప్రమాదవశాత్తు బస్సు ముందుచక్రాల ఇరుసు విరగడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనాలలో ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రి తరలించారు. చాగలమర్రి ఎస్సై శరత్‌కుమార్‌ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *