ప్రైవేటు వర్సెస్ ప్రభుత్వం.. కర్నూలులో కరోనా ఫైట్

కరోనాపై యుద్దమేమో గానీ కర్నూలు అధికార యంత్రాంగానికి వైద్యుల మధ్య తలెత్తిన తగాదాను పరిష్కరించడం పెద్ద సవాలుగా మారింది. కరోనా నియంత్రణలో ప్రైవేటు ఆసుపత్రులను సైతం భాగస్వాములను చేశామంటూ ప్రభుత్వాధినేతలు గొప్పగా చెప్పుకుంటుంటే.. ..

ప్రైవేటు వర్సెస్ ప్రభుత్వం.. కర్నూలులో కరోనా ఫైట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 09, 2020 | 4:08 PM

కరోనాపై యుద్దమేమో గానీ కర్నూలు అధికార యంత్రాంగానికి వైద్యుల మధ్య తలెత్తిన తగాదాను పరిష్కరించడం పెద్ద సవాలుగా మారింది. కరోనా నియంత్రణలో ప్రైవేటు ఆసుపత్రులను సైతం భాగస్వాములను చేశామంటూ ప్రభుత్వాధినేతలు గొప్పగా చెప్పుకుంటుంటే.. ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేసేందుకు ససేమిరా అంటున్నారు ప్రైవేటు వైద్యులు. కరోనా కోసం కేటాయించిన ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం ప్రభుత్వ వైద్యులే పని చేయాలని, తాము పని చేయమంటూ కర్నూలు ప్రైవేటు వైద్యులు మొండికేస్తున్నారు. దాంతో అధికార యంత్రాంగం ఏం చేయాలో పాలుపోక అయోమయానికి గురవుతోంది.

ఏపీవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధం చేసిన జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో వున్న ప్రైవేటు హాస్పిటల్స్‌ని కూడా వైరస్ నియంత్రణకు ఉపయోగించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయానికి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఓకే అన్నా వాటిల్లో పనిచేసే ప్రైవేటు వైద్యులు మాత్రం సర్వీస్ చేసేందుకు ససేమిరా అంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోను ప్రభుత్వ వైద్యుల సేవలనే వినియోగించుకోవాలని అధికార యంత్రాంగానికి చెబుతున్నారు. దాంతో పరిస్థితి కాస్త జఠిలంగా మారుతోంది.

ప్రభుత్వ ప్రైవేటు డాక్టర్ ల మధ్య వివాదం ముదురుతోంది. కోవిడ్ హాస్పిటల్స్‌లో తాము పని చేయలేమని ప్రైవేట్ డాక్టర్లు సిబ్బంది తేల్చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యులే కోవిడ్ హాస్పిటల్స్‌లో పనిచేయాలని చెబుతున్నారు. ఈ అంశాన్ని ఏకంగా మంత్రి బుగ్గన ముఖం మీదే చెప్పేయడంతో ఆయన అవాక్కయ్యారు. ప్రైవేటు డాకర్ల వైఖరిని ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ ఖండించింది. ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులను వదిలి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎలా పని చేస్తామమని వారు ప్రశ్నిస్తున్నారు. అయినా ప్రభుత్వం ఆదేశిస్తే ఎక్కడైనా పని చేసేందుకు వెనుకాడేది లేదని స్పష్టంగా చెబుతున్నారు. ప్రైవేటు వైద్యుల వైఖరితో కర్నూలు జిల్లాలో అయోమయం నెలకొంది.