ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ మందుబాబులు ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. మత్తు డ్రైవర్లు పట్టుబడుతున్నారు. లేటెస్ట్‌గా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.

కృష్టాజిల్లాలో రాత్రి రవాణాశాఖ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో వరుణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మందుకొట్టి డ్రైవ్ చేస్తూ దొరికిపోయాడు. ఈ బస్సు.. 40 మంది ప్రయాణికులతో గుంటూరు నుంచి విశాఖకు బయలుదేరింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరో డ్రైవర్‌తో బస్సుని తరలించారు. అధికారులు బస్సుని క్షుణ్ణంగా తనఖీలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో డ్రైవర్ దొరికిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలకు భద్రత ఎక్కడని డ్రైవర్‌పై మండిపడ్డారు.

అయితే గత రెండు రోజులుగా తనిఖీలు చేపడుతున్నా.. మందుకొట్టి డ్రైవ్ చేస్తూ దొరికిపోతున్నారు డ్రైవర్లు. ఇటీవల కంచికచర్ల సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో మూడు ప్రైవేట్ బస్సులకు చెందిన డ్రైవర్లు అడ్డంగా బుక్కయ్యారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ డ్రైవర్లు మాత్రం షరా మామూలుగానే వ్యవహరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *