ఇక కొత్త ఫీచర్లతో గూగుల్‌ సెర్చ్‌, యూట్యూబ్‌

యూ ట్యూబ్‌, గూగుల్‌ సెర్చ్‌, మ్యాప్స్‌, అసిస్టెంట్‌తోపాటు తమ కంపెనీకి చెందిన అన్ని ప్రొడక్టుల్లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. మరికొద్ది నెలల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్లు శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న గూగుల్‌ డెవలపర్ల వార్షిక సదస్సులో కంపెనీ వెల్లడించింది. లొకేషన్‌ హిస్టరీతోపాటు వెబ్‌, యాప్‌ యాక్టివిటీ డేటాను నిక్షిప్తం చేసేందుకు 3 నెలలు లేదా 18 నెలల కాలపరిమితిని ఎంచుకునేందుకు గూగుల్‌ కంట్రోల్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. యూజర్లు గూగుల్‌ మ్యాప్‌లోని తమ లొకేషన్‌ యాక్టివిటీ డేటాను […]

ఇక కొత్త ఫీచర్లతో గూగుల్‌ సెర్చ్‌, యూట్యూబ్‌
Follow us

| Edited By:

Updated on: May 09, 2019 | 5:54 PM

యూ ట్యూబ్‌, గూగుల్‌ సెర్చ్‌, మ్యాప్స్‌, అసిస్టెంట్‌తోపాటు తమ కంపెనీకి చెందిన అన్ని ప్రొడక్టుల్లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. మరికొద్ది నెలల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్లు శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న గూగుల్‌ డెవలపర్ల వార్షిక సదస్సులో కంపెనీ వెల్లడించింది. లొకేషన్‌ హిస్టరీతోపాటు వెబ్‌, యాప్‌ యాక్టివిటీ డేటాను నిక్షిప్తం చేసేందుకు 3 నెలలు లేదా 18 నెలల కాలపరిమితిని ఎంచుకునేందుకు గూగుల్‌ కంట్రోల్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

యూజర్లు గూగుల్‌ మ్యాప్‌లోని తమ లొకేషన్‌ యాక్టివిటీ డేటాను సమీక్షించేందుకు లేదా తొలగించేందుకు కంపెనీ త్వరలోనే అనుమతించనుంది. మ్యాప్స్‌లో ఇన్‌కాగ్నిటో మోడ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు.. సెర్చ్‌, మ్యాప్స్‌, యూట్యూబ్‌, క్రోమ్‌, అసిస్టెంట్‌, న్యూస్‌ అప్లికేషన్లలో ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగ్స్‌కు వన్‌ టాప్‌ యాక్సెస్‌ (డైరెక్ట్‌ ఆప్షన్‌) ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్‌ వెల్లడించింది. ‘‘సమాచార గోప్యత అందరికోసమనేది మా ఉద్దేశం. నిరంతరం మారుతున్న యూజర్ల అంచనాల కంటే ముందుండేందుకు మరింతగా కృషి చేయాలనుకుంటున్నాం’’ అని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ వివరించారు.