గాంధీ నుంచి ఖైదీలు పరార్.. పోలీసుల దర్యాప్తు వేగవంతం

కరోనాతో చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రి నుంచి పారిపోయిన నలుగురు ఖైదీల ఆచూకీ మూడు రోజులైనా లభించలేదు. భద్రతా వైఫల్యం వల్లే పారిపోయారన్న విమర్శలు రావడంతో పోలీస్‌ ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఖైదీలు అబ్దుల్‌ అర్బాజ్‌, జావేద్‌, సోమసుందర్‌, నరసయ్యలను పట్టుకునేందుకు..

గాంధీ నుంచి ఖైదీలు పరార్.. పోలీసుల దర్యాప్తు వేగవంతం
Follow us

| Edited By:

Updated on: Aug 30, 2020 | 1:30 PM

కరోనాతో చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రి నుంచి పారిపోయిన నలుగురు ఖైదీల ఆచూకీ మూడు రోజులైనా లభించలేదు. భద్రతా వైఫల్యం వల్లే పారిపోయారన్న విమర్శలు రావడంతో పోలీస్‌ ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఖైదీలు అబ్దుల్‌ అర్బాజ్‌, జావేద్‌, సోమసుందర్‌, నరసయ్యలను పట్టుకునేందుకు 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను విచారించారు. ఫోన్‌ చేసినా.. ఇంటికొచ్చినా వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. చిలకలగూడ పోలీసులు, గాంధీ ఆసుపత్రి చుట్టూ ఉన్న ఇతర ఠాణాల పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పాతబస్తీ, బోరబండలో గల్లీలు, కిరాణా దుకాణాల్లోనూ ఆరా తీస్తున్నారు. పరారైన ఖైదీలకు భోజనం చేసేందుకు, మద్యం తాగేందుకైనా కచ్చితంగా డబ్బు అవసరం.

ఇందుకు మళ్లీ చోరీలు చేసే అవకాశాలున్నాయన్న అంచనాతో పోలీస్‌ అధికారులు నగరంలో ఎక్కడైనా దొంగతనాలు జరిగాయా? వాహనాలను ఎత్తుకెళ్లారా? కేసులు నమోదయ్యాయా? తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఉచితంగా భోజనం పెడుతున్న సంస్థలు, స్థలాల వద్ద విచారించారు. నగదు కోసం సంప్రదిస్తారనే కోణంలో నలుగురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫోన్లపై నిఘా ఉంచారు. ఒకట్రెండు రోజుల్లో పట్టుకుంటామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

Read More:

ఇంకా డీప్‌ కోమాలోనే ప్రణబ్.. వెంటిలేటర్ మీద చికిత్స

బ్రేకింగ్: ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్

అన్నదాతలే మనకి గర్వకారణం.. ‘మన్‌కీ బాత్’లో ప్రధాని

మరో ఏపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్