రూ.75 నాణేన్ని విడుదల చేసిన ప్రధాని

ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రూ.75 స్మారక నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. దేశంలో పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడానికి అవసరమైన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ప్రధాని అన్నారు...

రూ.75 నాణేన్ని విడుదల చేసిన ప్రధాని
Follow us

|

Updated on: Oct 16, 2020 | 2:01 PM

Coin of Rs 75 Denomination : ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రూ.75 స్మారక నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. దేశంలో పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడానికి అవసరమైన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి చేసిన 17 రకాల కొత్త పంటలను ప్రదాని ఆవిష్కరించారు. వీటి వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో దేశంలోని పాతరికార్డులన్నీ చెరిగిపోయాయని… రైతులకు కనీస మద్ధతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. సరైన వసతులు లేనందువల్ల ఆహారధాన్యాలను నిల్వ చేసుకోవడం సమస్యగా మారుతోందని, దీనిని నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు మరింత లబ్ధిపొందుతారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. మరోవైపు పెళ్లి వయస్సు ఎంత ఉండాలన్న దానిపై తనకు లేఖలు వస్తున్నాయని అన్నారు. ఈ అంశంపై చర్చలు నడుస్తున్నాయని, దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత నూతన చట్టం రూపొందిస్తామని చెప్పారు.