బ్రేకింగ్: మువ్వన్నల జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ..!

Prime Minister Narendra Modi hoistes Flag on Red Fort

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశమంతా ముస్తాబైంది. దేశరాజధాని ఢిల్లీతో సహా ప్రధాన నగరాల్లో వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై మువ్వన్నల జెండా ఎగురవేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ఇది ఆరవ సారి.

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రెండోసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న కీలక నిర్ణయాలు, ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ విభజన వాటి అభివృద్ధికి తీసుకోనున్న చర్యలను వివరించారు. స్వచ్ఛభారత్, ఆయుష్మాన్‌భారత్ తదితర పథకాలను ప్రస్తావించడంతోపాటు తమ పాలనలో జరిగిన అభివృద్ధిని సైతం ప్రధాని ప్రస్తావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *