ఉగాది విషెస్ చెప్తూ.. ఈ అమ్మ ఆశయానికైనా రెస్పెక్ట్ ఇవ్వండంటున్న మోదీ

తెలుగు ప్రజల కొత్త సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది… ఈ ఏడాది ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతన శక్తిని ప్రసాదిస్తుందని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో.. ముఖ్యంగా ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తూ.. తెలుగులో తన అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఇక కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు మంగళవారం ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. […]

ఉగాది విషెస్ చెప్తూ.. ఈ అమ్మ ఆశయానికైనా రెస్పెక్ట్ ఇవ్వండంటున్న మోదీ
Follow us

| Edited By:

Updated on: Mar 25, 2020 | 1:35 PM

తెలుగు ప్రజల కొత్త సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది… ఈ ఏడాది ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతన శక్తిని ప్రసాదిస్తుందని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో.. ముఖ్యంగా ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తూ.. తెలుగులో తన అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

ఇక కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు మంగళవారం ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలంతా ఇంట్లోనే ఉండి కరోనా వ్యాప్తి కట్టడికి సహకరించాలని కోరారు. తాజాగా.. ఆదివారం దేశ వ్యాప్తంగా జన్తా కర్ఫ్యూ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ రోజు సాయంత్రం 5.00 గంటలకు.. కరోనాను అరికట్టేందుకు శ్రమిస్తున్న వైద్యులకు, శానిటైజేషన్‌లో పనిచేస్తున్నవారికి, నర్సులకు, ల్యాబ్ టెక్నీషియన్లను అభినందిస్తూ చప్పట్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ వృద్దురాలు.. తన పూరి గుడిసెలో ఉంటూ.. యావత్ భారతావనికి ఆదర్శంగా నిలిచేలా.. గుడిసె బయట కూర్చొని చప్పట్లు కొట్టిన వీడియో గురించి తెలిసిందే. ఆ అమ్మ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ.. అంతా ఇంట్లోనే ఉండాలంటూ మోదీ కాంమెంట్ చేశారు.

కాగా.. ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 500కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 10మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది. ఈ సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతనశక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ముఖ్యంగా ఆరోగ్యంతో వుండాలని ప్రార్ధిస్తున్నాను.

— Narendra Modi (@narendramodi) March 25, 2020