కేశ‌వానంద భార‌తి మృతిప‌ట్ల ప్ర‌ధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి

ప‌్ర‌ముఖ‌ ఆధ్యాత్మిక గురువు కేశ‌వానంద భార‌తి మృతిప‌ట్ల ప్ర‌ధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. అణ‌గారిన‌ వ‌ర్గాల అభివృద్ధికి చేసిన కేశవానంద‌ కృషిని, స‌మాజ సేవ ఎల్ల‌ప్పుడూ గుర్తుంచుకుంటామ‌ని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

కేశ‌వానంద భార‌తి మృతిప‌ట్ల ప్ర‌ధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి
Follow us

|

Updated on: Sep 06, 2020 | 5:58 PM

Prime Minister Modi : ప‌్ర‌ముఖ‌ ఆధ్యాత్మిక గురువు కేశ‌వానంద భార‌తి మృతిప‌ట్ల ప్ర‌ధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. అణ‌గారిన‌ వ‌ర్గాల అభివృద్ధికి చేసిన కేశవానంద‌ కృషిని, స‌మాజ సేవ ఎల్ల‌ప్పుడూ గుర్తుంచుకుంటామ‌ని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భార‌త‌దేశ గొప్ప సంస్కృతి, సంప్ర‌దాయాలు, రాజ్యాంగాన్ని గౌర‌వించే వారు అని పేర్కొన్నారు. కేశ‌వానంద భార‌తి భావితరాల‌కు స్ఫూర్తిగా నిలుస్తార‌ని ఆయన అన్నారు.

కేర‌ళ‌లోని ఎడ‌నీర్ మ‌ఠ్‌లో కేశ‌వానంద భార‌తి శివైక్యం పొందిన‌ట్లు పోలీసులు ప్రకటించారు. గత కొంతకాలంగా కేశవానంద భారతి అనారోగ్యంతో బాధపడతున్నట్టు ఆశ్రమవర్గాలు వెల్లడించాయి. ఆధ్యాత్మికవేత్తగానే కాకుండా రాజ్యాంగ హక్కులపై ఆయన చేసిన న్యాయపోరాటంతోనే దేశవ్యాప్తంగా కేశవానంద భారతి గుర్తింపు పొందారు. చరిత్ర గతినే మార్చివేసిన కేసుగా దీన్ని న్యాయ కోవిదులు అభివర్ణిస్తుంటారు. సుప్రీంకోర్టు కేసుల్లో స్వామి కేశవానంద భారతి కేసు చరిత్రాత్మకమైంది. దీన్నే కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం కేసుగా సంచలనం. పలు కేసులకు దీనినే మైలురాయిగా తీసుకుంటారు. 29 ఏళ్ల వయసులోనే సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఓ సంచలనం. ఈ కేసు సుప్రీంకోర్టు చరిత్రలో సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. ఏకంగా 68 రోజుల పాటు ఈ కేసు విచారణ నడిచింది. ఏకంగా 13 మంది న్యాయమూర్తులతో ఏర్పాటైన విస్తృత ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది. 68 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసు కేశవానంద భారతికి అనుకూలంగా వెలువడింది.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..