కరోనాపై అఖిలపక్షం.. మోదీ ఖరారు చేసిన తేదీ ఎప్పుడంటే?

దేశంలో కరోనా వైరస్ విలయతాండం పీక్ లెవల్‌కు చేరిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, క్రీడాకారులు, అధికార యంత్రాంగంతో తరచూ భేటీ అవుతున్న ప్రధాని, తాజాగా లాక్ డౌన్ పీరియడ్ ముగింపు దగ్గరవుతున్న తరుణంలో అఖిలపక్షంతో భేటీ కావాలని నిర్ణయించారు.

కరోనాపై అఖిలపక్షం.. మోదీ ఖరారు చేసిన తేదీ ఎప్పుడంటే?
Follow us

|

Updated on: Apr 04, 2020 | 5:48 PM

దేశంలో కరోనా వైరస్ విలయతాండం పీక్ లెవల్‌కు చేరిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, క్రీడాకారులు, అధికార యంత్రాంగంతో తరచూ భేటీ అవుతున్న ప్రధాని, తాజాగా లాక్ డౌన్ పీరియడ్ ముగింపు దగ్గరవుతున్న తరుణంలో అఖిలపక్షంతో భేటీ కావాలని నిర్ణయించారు. కాంగ్రెస్ తదితర రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తుండడం ఒకవైపు, లాక్ డౌన్ ముగింపు దశలో తీసుకోవాల్సిన నిర్ణయాలు అత్యంత కీలకమవుతున్న తరుణం మరోవైపు ఉన్న నేపథ్యంలో మోదీ విపక్షాలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 11 గంటలకు లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి కనీసం అయిదుగురు ఎంపీలున్న ప్రతీ పార్టీకి సంబంధించిన నేతను ప్రధాని నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి ఆహ్వానించనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ అఫైర్స్ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటన విడుదల చేశారు. ఉభయ సభల్లో కలిపి అయిదుగురు సభ్యులుండాలన్నది ప్రధాన నిబంధన కాగా.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మూడు ప్రధాన పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలకు ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనే అవకాశం దక్కనుంది. తెలంగాణ నుంచి టీఆర్ఎస్, ఏపీ నుంచి వైసీపీ, టీడీపీలకు ప్రధాన మంత్రి నిర్వహించే ఆహ్వానం దక్కనున్నది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి లోక్ సభలో ముగ్గురు, రాజ్యసభలో ఇద్దరు సభ్యులున్నారు. అయిదురు సభ్యులుండడంతో టీడీపీకి కూడా ప్రధాని నిర్వహించే అఖిలపక్ష భేటీకి ఆహ్వానం దక్కనున్నది.

టీఆర్ఎస్, వైసీపీలకు లోక్‌సభలోనే కావాల్సిన నెంబర్ వుండడంతో రాజ్యసభ సభ్యుల సంఖ్యతో ప్రమేయం లేకుండానే ప్రధాని నిర్వహించనున్న అఖిలపక్షం వీడియో కాన్ఫరెన్సుకు హాజరయ్యే అవకాశం దక్కనున్నది.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు