Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

అటు భారీ వర్షాలు.. ఇటు ఆర్టీసీ సమ్మె.. నలిగిపోతున్న సామన్యుడు..!

Prices of Vegetables Increased due to RTC strike and Heavy Rains, అటు భారీ వర్షాలు.. ఇటు ఆర్టీసీ సమ్మె.. నలిగిపోతున్న సామన్యుడు..!

తెలంగాణలో సామాన్యుడి పరిస్థితి మారీ దారుణంగా ఉంది. ఒక వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఆర్టీసీ సమ్మె.. తీవ్రప్రభావం చూపుతున్నాయి. భారీ వర్షాలతో.. జనాలు అల్లకల్లోలు అవుతూ.. రోగాల బారిన పడుతుంటే.. ఆర్టీసీ సమ్మె.. ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. గత కొద్ది రోజులుగా.. తెలంగాణలో తీవ్ర వర్షా ప్రభావం నెలకింది. దీంతో.. జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. దానికి తోడు ఇప్పుడు ఆర్టీసీ సమ్మె తోడయ్యింది. ఇంకేముంది.. సామాన్యుడి బతుకు జట్కా బండిలాగ సాగుతోంది.

గత నెల సెప్టెంబర్‌ నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. రోడ్లన్నీ జలమయవుతున్నాయి. రోడ్లపైకి.. ఇళ్లలోకి నీరు చేరుతోంది. కొన్ని రోజుల క్రితమైతే.. నడుము లోతు నీరు చేరింది. దీంతో.. ప్రజలు బయటకి రాలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ కూడా వరుణుడి ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇక.. జిల్లాలవారీగా.. కూడా వర్షం దంచికొడుతోంది. దీంతో.. చేతి కొచ్చిన పంట నేలపాలవుతోంది. దాంతో.. రైతులు లబోదిబోమంటున్నారు. ఈ భారం కాస్తా.. సామాన్యుడిపై పడుతోంది. ఇప్పటికే ఉల్లి రేటుతో కన్నీరు పెట్టిస్తోంది. అలాగే.. టమాటా రేటు కూడా బరువెక్కుతోంది. ఇప్పడు.. కూరగాయల ధరలు తలనొప్పి తెప్పిస్తున్నాయి.

Prices of Vegetables Increased due to RTC strike and Heavy Rains, అటు భారీ వర్షాలు.. ఇటు ఆర్టీసీ సమ్మె.. నలిగిపోతున్న సామన్యుడు..!

ఇక ఆర్టీసీ సమ్మె‌ జనాలకి చుక్కలు చూపిస్తోందనే చెప్పాలి. సరిగ్గా.. దసరా పండగకు స్ట్రైక్‌ స్టార్ట్ చేశారు ఆర్టీసీ కార్మికులు. దీంతో.. ప్రజలు ఊరు దాటలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే అదునుగా.. ప్రైవేటు ట్రావెల్స్.. తమ చేతివాటం ప్రదర్శించారు. రెండు రోజులైనా సమ్మె సర్దుకుంటుంది అంటే.. ఆర్మీసీ కార్మికులు మొండి పట్టు వదలడం లేదు. అప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా.. బస్సులను, తాత్కాలిక డ్రైవర్లను, కండెక్టర్లను ఏర్పాటు చేసినా.. వారు కూడా.. అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులైతే.. తప్పదు అన్న చందంగా.. వారు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక ఎత్తుఅయితే.. ఆర్టీసీ సమ్మెతో కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. దీంతో.. సామాన్యుడికి పరిస్థితి కక్కలేని.. మింగలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఇటు వర్షాలు.. అటు ఆర్టీసీ సమ్మె రెండూ.. ప్రజలను గందరగోళ స్థితిలో పడేశాయనే చెప్పాలి.

ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్‌ మార్కెట్లో.. కిలో ఉల్లిపాయలు రూ.50, కిలో టమోటా రూ.40-45, బంగాళదుంపలు కిలో రూ.60, వంకాయలు కిలో రూ.50, బెండకాయలు కిలో రూ.60, క్యారెట్ కిలో రూ.55, క్యాప్సికమ్ కిలో రూ.65లుగా ఉన్నాయి.

Related Tags