కొండెక్కిన నిత్యావసరాల ధరలు!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. పప్పుల ధరలు నానాటికి కొండెక్కు తున్నాయి. సామాన్యుడు కూరగాయలకు దూరమవుతున్నాడు. రేషన్‌ షాపుల్లో ఇచ్చే బియ్యం తప్ప మరేదీ ఊరటనివ్వడం లేదు. ఓ వైపు పేదలు, సామాన్యుల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప సామాన్యుల సగటు జీవితాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. పండుగలు, పర్వదినాలలో సైతం పప్పుల ధరలు, కూరగాయలు ధరలు పెరగడం పేద, మధ్య తరగతి ప్రజలకు మరింత భారంగా మారింది.

కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. బీమా పధకాల పేరుతో  వచ్చే డబ్బుల మాట ఏమో గాని తాము బతికుండగా కడుపు నిండా అన్నం తినే అవకాశాన్ని కల్పిస్తే చాలని పేదలు కోరుతున్నారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచాల్సిన ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోక పోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, తగ్గిన దిగుబడి, దళారుల కృత్రిమ కొరత కారణంగా ధరలు పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *