Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

త్వరలో ప్రభుత్వం ఏర్పాటు.. “మహా” పోరులో బీజేపీ ట్విస్ట్..!

Presidents Rule unfortunate.. hope stable govt will be formed soon : Devendra Fadnavis, త్వరలో ప్రభుత్వం ఏర్పాటు.. “మహా” పోరులో బీజేపీ ట్విస్ట్..!

“మహా” రాజకీయాలు గంటకో తీరు మారుతున్నాయి. ఫలితాలు వచ్చి.. దాదాపు ఇరవై రోజులు అయినా ప్రభుత్వం ఏర్పాటు కాని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ కేంద్ర క్యాబినెట్‌కు సిఫారసు చేయడం.. ఆ తర్వాత దానిని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ ఆమోదం చెప్పడం.. అంతా చకచకా జరిగిపోయాయి. ఆ వెంటనే కేంద్ర క్యాబినెట్ తీర్మానంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా ఆమోదముద్ర వేయడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. దీంతో ఆరు నెలల పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉండనుంది. అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయకాకపోతే.. ఎన్నికలు తప్పనిసరి కానున్నాయి. ఒకవేళ ఈ మధ్యలో ప్రభుత్వం ఏర్పాటు జరిగితే.. రాష్ట్రపతి పాలన తొలగిస్తామని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ స్పందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన దురదృష్టకరమని అన్నారు. అంతేకాదు..  త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే ఎవరి మద్దతుతో అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత నారాయణ్ రాణే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. త్వరలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు వ్యాఖ్యలు చేశారు.

కాగా, మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో.. బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించగా.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 చోట్ల గెలుపొందాయి. 29 చోట్ల స్వతంత్రులు గెలిచారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన 145 మంది ఎమ్మెల్యేల బలం ఏ పార్టీకీ లేదు. అయితే కూటమిగా ఉన్న శివసేన-బీజేపీ అధికారం చేపట్టేందుకు కావాల్సినంత బలం ఉన్నా.. సీఎం పీఠం విషయంలో విభేధాలు వచ్చి విడిపోయాయి. అయితే ఎట్టిపరిస్థితుల్లోనైనా సీఎం పీఠం అధిష్టించాలని మొండిపట్టుతో ఉన్న శివసేన.. ఎన్సీపీ-కాంగ్రెస్ మద్దతిస్తాయని ఆశించి భంగపడింది. దీంతో మొదటికే మోసం వచ్చినట్లైంది. ఇదే సమయంలో శివసేనతో ఎన్సీపీ-కాంగ్రెస్‌ చేతులు కలిపేందుకు వెనకడుగు వేస్తుండటాన్ని గమనించిన కమలదళం.. మళ్లీ రంగంలోని దిగినట్లు తెలుస్తోంది. శివసేన నేతలతో మళ్ళీ బీజేపీ సంప్రదింపులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే.. త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.