యుధ్ధ సన్నాహాలకు సిధ్ధం కండి… సైన్యానికి చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పిలుపు

భారత, చైనా దేశాల మధ్య క్రమంగా  యుధ్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా ? చూడబోతే అలాగే ఉంది. యుధ్ధ సన్నాహాలకు రెడీగా ఉండాలని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తమ సైనిక దళాలకు పిలుపునిచ్చారు.

యుధ్ధ సన్నాహాలకు సిధ్ధం కండి... సైన్యానికి చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పిలుపు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 27, 2020 | 10:53 AM

భారత, చైనా దేశాల మధ్య క్రమంగా  యుధ్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా ? చూడబోతే అలాగే ఉంది. యుధ్ధ సన్నాహాలకు రెడీగా ఉండాలని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తమ సైనిక దళాలకు పిలుపునిచ్చారు. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకునేందుకు సంసిధ్దం కావాలన్నారు. పాలక కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శి, దాదాపు 20 లక్షల మిలిటరీకి హెడ్ కూడా అయిన జిన్ పింగ్.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, పీపుల్స్ లిబరేషన్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కి చెందిన ప్రతినిధి బృంద ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. బీజింగ్ లో ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. శిక్షణను మరింత పెంచుకోవాలని, ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా దేశ సార్వభౌమాధికారాన్ని, సెక్యూరిటీని పరిరక్షించుకోవడానికి సమాయత్తం కావాలని జిన్ పింగ్ సూచించారని సిన్ హువా వార్తా సంస్థ తెలిపింది. అయితే తమ దేశానికి ఎక్కడినుంచి ముప్పు వస్తుందో చెప్పకుండా దాటవేశారు.

లడఖ్ లోని వాస్తవాధీన రేఖ పొడవునా భారత, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆయన చేసిన హెచ్ఛరికలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. నార్త్ సిక్కిం లోను, లడఖ్ లోని  వివాదాస్పద ప్రాంతాల్లోనూ  ఉభయ దేశాల సైనిక దళాల మధ్య ఇటీవలి కాలంలో ఘర్షణలు జరుగుతున్నాయి. లడఖ్ సరిహద్దుల్లో చైనా తన ఎయిర్ బేస్ నిర్మాణాలను ముమ్మరం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..