కోవిందుడి రాకకోసం..

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ రానున్నారు. ఈనెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో అధ్యక్షుడు కోవింద్‌ శీతాకాల విడిది చేయనున్నారు. 20వతేదీ మధ్యాహ్నం 1గంటకు హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారన్నది సమాచారం. 20 నుంచి 22 వరకు రాష్ట్రపతి నిలయంలో కోవింద్ బస చేయనున్నారు. 23న తిరువనంతపురం వెళ్లనున్నారు. 26న సాయంత్రం హైదరాబాద్ కు రాష్ట్రపతి తిరిగి రానున్నారు. 27న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ […]

కోవిందుడి రాకకోసం..
Follow us

|

Updated on: Dec 18, 2019 | 12:21 PM

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ రానున్నారు. ఈనెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో అధ్యక్షుడు కోవింద్‌ శీతాకాల విడిది చేయనున్నారు. 20వతేదీ మధ్యాహ్నం 1గంటకు హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారన్నది సమాచారం. 20 నుంచి 22 వరకు రాష్ట్రపతి నిలయంలో కోవింద్ బస చేయనున్నారు. 23న తిరువనంతపురం వెళ్లనున్నారు. 26న సాయంత్రం హైదరాబాద్ కు రాష్ట్రపతి తిరిగి రానున్నారు. 27న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. 28న మధ్యాహ్నం రాష్ట్రపతి ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు అధ్యక్షుడి రాష్ట్ర పర్యటనపై రాష్ట్రపతి భవన్‌ నుంచి సమాచారం అందుకున్న సిటీపోలీసులు.. పటిష్ట ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖలూ అప్రమత్తమయ్యాయి. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆయన విడిది చేసే బొల్లారం రాష్ట్రపతి నిలయాన్ని కేంద్ర భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ చుట్టుపక్కల ప్రజలెవరూ ప్రవేశించకుండా.. పోలీసులు నిషేధం విధించారు. ఇక రాష్ట్రపతి పర్యటన నిమిత్తం తీసుకోవాల్సిన చర్యలపైనా, బందోబస్తు ఏర్పాట్లపైనా సీఎస్ ఆరా తీశారు.

ఇక, సాధారణ సమయాల్లో రాష్ట్రపతి నిలయంలో సామాన్యప్రజలకు ప్రవేశం ఉండదు. గట్టి పోలీసు భద్రత ఉంటుంది. కానీ ప్రతి ఏడాది రాష్ట్రపతి శీతాకాల విడిది తరువాత వారం రోజుల పాటు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించడానికి అనుమతిస్తారు. ఏడాదిలో ఓ నెల రోజులు మాత్రం, అదీ రాష్ర్టపతి హైదరాబాద్ వస్తున్నారంటే, ఆయా ఏర్పాట్లు చూసే అధికారులు, సంబంధిత సిబ్బందితో రాష్ర్టపతి నిలయం సందడిగా పలు ప్రభుత్వశాఖల అధికారులతో నిండిపోతుంది. 2011 నుంచి రాష్ర్టపతి పర్యటనకు వచ్చి తిరిగి వెళ్లిన అనంతరం వారం రోజులపాటు సాధారణ పౌరులకు ఈ నిలయాన్ని సందర్శించే అవకాశం కలిపిస్తున్నారు.

రాష్ట్రపతి నిలయం సందర్శనను తీపి గుర్తుగా ఉంచుకోవడానికి సందర్శకులు కెమెరాలతో ఫోటోలు తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే వాహనాల ద్వారా రాష్ట్రపతి నిలయంలోకి ప్రవేశం ఉంటుంది. మిగతా వారు రాష్ట్రపతి నిలయం ఎదుట ఉన్న పార్కింగ్ లో తమ వాహనాలను నిలపాలి. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో, దట్టమైన పురాతన చెట్ల నీడలో రాష్ట్రపతి నిలయం ఆనాటి రాచరికపు తీపి గుర్తుగా నిలుస్తుంది.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!