నిర్భయ దోషులకు ఇక ఉరే ! పవన్ మెర్సీ పిటిషన్ తిరస్కృతి

నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. పవన్ క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ నెల 2 న కొట్టివేసిన సంగతి విదితమే.

నిర్భయ దోషులకు ఇక ఉరే ! పవన్ మెర్సీ పిటిషన్ తిరస్కృతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 04, 2020 | 5:17 PM

నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. పవన్ క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ నెల 2 న కొట్టివేసిన సంగతి విదితమే. ఇక ఈ నలుగురు దోషుల పిటిషన్లన్నీ తిరస్కరణకు గురి కావడంతో వీరికి గల న్యాయ మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు గతనెల 17 న ఈ దోషులకు డెత్ వారెంట్లు జారీ చేసింది. మార్చి 3  న ఉదయం 6 గంటలకు వీరిని ఉరి తీయాలని ఆ వారెంట్లలో పేర్కొంది. అయితే అప్పుడు పవన్ మెర్సీ పిటిషన్  రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉంది. కానీ ఇప్పుడు పెండింగులో లేదు గనుక పటియాలా కోర్టు కొత్తగా డెత్ వారెంట్లు జారీ చేయనుంది.  మరో 14 రోజుల గడువు వీరికి ఉన్నట్టే.