తిరుమల పర్యటనకు భారత రాష్ట్రపతి రాక

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 13వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 5.05 గంటలకు చెన్నై నుంచి విమానంలో బయల్దేరి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. పది నిమిషాల విశ్రాంతి తీసుకుని కారులో తిరుమలకు వెళతారు. పద్మావతి అతిథి గృహంలో రాత్రి బస చేసి.. 14వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు వరాహస్వామి ఆలయానికి చేరుకుంటారు. తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు అతిథి గృహం నుంచి బయల్దేరి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌కు […]

తిరుమల పర్యటనకు భారత రాష్ట్రపతి రాక
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2019 | 7:54 AM

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 13వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 5.05 గంటలకు చెన్నై నుంచి విమానంలో బయల్దేరి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. పది నిమిషాల విశ్రాంతి తీసుకుని కారులో తిరుమలకు వెళతారు. పద్మావతి అతిథి గృహంలో రాత్రి బస చేసి.. 14వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు వరాహస్వామి ఆలయానికి చేరుకుంటారు. తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు అతిథి గృహం నుంచి బయల్దేరి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌కు వెళ్లనున్నారు. చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని వీక్షించాక అనంతరం 15వ తేదీ ఉదయం 9.55 గంటలకు తిరుపతి విమాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.