లతా మంగేష్కర్‌ తో రాష్ట్రపతి భేటీ!

President Ram Nath Kovind meets legendary singer Lata Mangeshkar at her residence, లతా మంగేష్కర్‌ తో రాష్ట్రపతి భేటీ!

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పరామర్శించారు. ముంబయిలోని ఆమె నివాసానికి వెళ్లి, కాసేపు ముచ్చటించారు. కోవింద్‌ తన ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని లెజెండరీ గాయని ట్వీట్‌ చేశారు. ఆయనతోపాటు కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. ‘మన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నన్ను కలవడానికి మా ఇంటికి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. సర్‌.. మీరు మేం గర్వపడేలా చేశారు’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆమె చిత్ర పరిశ్రమకు చేసిన సేవకు గానూ 1989లో భారత ప్రభుత్వం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. 2001లో అత్యున్నత పురస్కారం భారత రత్న అవార్డుతో గౌరవించింది.

ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *