భారతీయులందరిదీ ఒకే కల.. జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి

Ram Nath Kovind

73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370రద్దుతో కశ్మీర్ ప్రజలకు న్యాయం జరిగిందని ఆయన అన్నారు. జమ్ముకశ్మీర్, లడఖ్ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని.. ట్రిపుల్ తలాఖ్ బిల్లుతో మహిళా సాధికారికత సాధించామని ఆయన అన్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు, వసతులు ఉన్నాయో..ఇక నుంచి జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రజలు కూడా అన్ని హక్కులు, సౌకర్యాలు పొందుతారని తెలిపారు. ఇక మరికొన్ని వారాల్లో అక్టోబర్ 2న జాతిపిత మహాత్మగాంధీ 150 జయంతి వేడుకలు జరగునున్నాయని.. గాంధీ కృషి, పట్టుదల, అకుంఠిత దీక్షతో బ్రిటీష్ పాలన నుంచి భారత్‌కు విముక్తి కలిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ ఏడాది ప్రఖ్యాత సిక్కు గురువు గురునానక్ 550వ జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించుకున్నామని తెలిపారు. భారతీయులందరిదీ ఒకే కల అని ఆ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోవింద్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *