Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 82 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 182143. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89995. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 86984. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5164. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: నిమ్మగడ్డ అంశం పై కొనసాగుతున్న ప్రభుత్వం కసరత్తు . ఇప్పటికే సుప్రీం కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం . నిమగడ్డ తనంతట తాను పునః నియమిచుకున్న సర్కులర్ ను వెనక్కు తీసుకున్న ఎస్ఈసి.
  • చిత్తూరు జిల్లా : ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో మిడతల దండు. అయితే ఇవి మహారాష్ట్రనుంచి వచ్చిన మిడతల దండు కాదంటున్న అధికారులు. కుప్పం సరిహద్దులోని తమిళనాడు వేపనపల్లి లో ప్రత్యక్షమైన మిడతల దండు. రాత్రికి రాత్రే పంటలు నాశనం చేస్తున్న మిడతలు. పచ్చగా కనిపించిన ప్రతి చెట్టుని తినేస్తున్న మిడతలు. అరటి చెట్లను వదలని మిడతలు. రంగంలోకి దిగిన అధికారులు..మిడతల పై ఫెర్టిలైజర్స్ చల్లి తరిమి కొట్టే ప్రయత్నం.
  • బంజారాహిల్స్ లో దారుణం. భార్యను హతమార్చిన భర్త. భార్య భర్తల గొడవతో హీటర్ తో బాధి హత్య చేసిన భర్త. తలకు గాయం కావడం తో మృతి చెందిన భార్య. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు.
  • ఈరోజుతో ముగియనున్న సర్వేలేన్స్ సర్వే. ఎలిజా ప్రక్రియ ద్వారా రక్త నమూనా సేకరిస్తున్న ICMR ,NIN. జిహెచ్ఎంసి లోని ఐదు ప్రాంతాలలో ఈరోజు సర్వే. 18 సంవత్సరాలు పై బడిన అన్ని వయసుల వారికి టెస్టులు చేస్తున్న NIN. ఒక్కో కంటైన్మెంట్ జోన్ 100 శాంపిల్స్ తీసుకుంటున్న ICMR,NIN అధికారులు. మొత్తం రంగారెడ్డి,ghmc లలో 500 శాంపిల్స్ తీసుకోనున్న బృందాలు. మొత్తం సిరం శాంపిల్స్ ను చెన్నై పంపనున్న ICMR,NIN అధికారులు.
  • తిరుపతి లో గంజాయి మత్తుగాళ్ళ హాల్ చల్ . తాతయ్యగుంట లో గంజాయి మత్తులో యువకుడి పై కత్తితో దాడి . శనివారం రాత్రి సంఘటన . దాడికి పాల్పడిన ఆరుగురు దుండగులు . కతిదాడిలో తీవ్రంగా గాయపడిన వెంకట సాయి (15). రుయా ఆసుపత్రి కి తరలింపు... ప్రాథమిక చికిత్స . తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

మోదీ రాజీనామా: ఆమోదించిన రాష్ట్రపతి

President Accepts PM Modi’s Resignation, మోదీ రాజీనామా: ఆమోదించిన రాష్ట్రపతి

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించగా.. దాన్ని ఆయన ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రధానిగా కొనసాగాలంటూ మోదీని రాష్ట్రపతి కోరారు. మంత్రి మండలిని రద్దుచేయాలని ఈ సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో శుక్రవారం కేంద్ర కేబినెట్‌ సమావేశమై 16వ లోక్‌సభ రద్దుకు తీర్మానం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని రాజీనామాతో 17వ లోక్‌సభ ఏర్పాటు కోసం ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం కొత్త లోక్‌సభ కోసం అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం మే 30న కొలువుదీరనుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్డీఏ పక్షాలన్నీ మే 25న సమావేశం కానున్నాయి. మోదీని తమ నాయకుడిగా ఆ కూటమి అధికారికంగా ఎన్నుకోనుంది.

Related Tags