ఆఫ్రికా పర్యటనకు బయల్దేరిన రాష్ట్రపతి

President Kovind departs on 3-country visit to Africa, ఆఫ్రికా పర్యటనకు బయల్దేరిన రాష్ట్రపతి

ఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఏడు రోజుల ఆఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బెనిన్‌, జాంబియా, గినియా దేశాలు సందర్శించనున్నారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ట్వీట్‌ చేశారు. ఆఫ్రికా దేశాలతో బంధాలను బలోపేతం చేసుకొనే లక్ష్యంగా రాష్ట్రపతి పర్యటన ఉంటుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘‘జాంబియా, బెనిన్‌, గినియా దేశాల అధ్యక్షులతో రాష్ట్రపతి సమావేశమవుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఎనర్జీ వంటి రంగాల్లో ఆయా దేశాలతో బంధం బలోపేతం దిశగా ఈ చర్చలు ఉంటాయి. స్థానికంగా నివాసముండే భారతీయులను కలుసుకొని రాష్ట్రపతి ప్రసంగిస్తారు.’’ అని ట్వీట్‌ చేశారు. రాష్ట్రపతితోపాటు పర్యటనలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలశాఖ సహాయ మంత్రి, ప్రతాప్‌ చంద్ర సారంగి, ఎంపీ దిలీప్‌ ఘోష్‌ ఉన్నారు.కోవింద్‌ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక ఒకేసారి మూడు దేశాలను సందర్శించడం ఇదే కావడం విశేషం. ఆఫ్రికాకు ఇది ఆయన నాలుగో పర్యటన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *